తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ దందా : సామాన్యుల నిలువుదోపిడీ .. ఒక్క రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ ఎంతంటే !!
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కష్టకాలంలో బ్లాక్ మార్కెట్ జోరందుకుంది. కరోనా బాధితులకు అందించే వైద్యానికి సంబంధించి వినియోగించే మందులు, ఇంజక్షన్ల ధరలకు కట్టడి లేకుండాపోయింది. శ్వాసకోశ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న కరోనా బాధితులకు ఇచ్చే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ధర ఒక్కో ఇంజక్షన్ కు 30 వేల రూపాయల దాకా బ్లాక్ మార్కెట్లో పలుకుతోంది. మొత్తం రెమ్‌డెసివిర్ డోసులు ఆరు కరోనా బాధితులకు ఇవ్వవలసిన నేపథ్యంలో వీటిని కొనుగోలు చేయాలంటే దాదాపు లక్షా ఎనభై వేల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి సామాన్యులు తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది.

ఆస్పత్రుల్లో నో రెమ్‌డెసివిర్.. జోరుగా సాగుతున్న బ్లాక్ దందా
ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయలేక , ఆసుపత్రులలో లేవని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో సామాన్యులు దీనంగా రోదిస్తున్నారు.
కరోనా మహమ్మారి బారిన పడి శ్వాసకోశ సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వారి బంధువులు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ కోసం పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో ఇంజెక్షన్లు అందుబాటులో లేవని వైద్యులు చెబుతున్న పరిస్థితులతో బ్లాక్ లో కొనుగోలు చేయడానికి విఫల యత్నాలు చేస్తున్నారు.

బాధితుల అవసరాన్ని బట్టి దోపిడీ పర్వానికి తెర తీసిన అక్రమార్కులు
తెలుగు రాష్ట్రాలలో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను ఇప్పటికే బ్లాక్ చేసిన అక్రమార్కులు, బాధితుల అవసరాన్ని బట్టి విపరీతమైన ధరలు పెంచి విక్రయిస్తున్నారు . రెమ్‌డెసివిర్ అసలు ధర దాదాపు 3,000 రూపాయలు గా ఉంటే, దానికి పది రెట్లు పెంచి 30 వేల రూపాయలు గా విక్రయిస్తున్న పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది.
ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ బ్లాక్ మార్కెట్ అవుతుంది . ఏ ఆస్పత్రికి వెళ్ళినా ఇంజక్షన్ లు లేవు అనే పదమే ముందు వెలుగు చూస్తుంది.

మందులు , ఇంజక్షన్ ల కోసం సామాన్యుల నుండి సంపన్నుల వరకు నిలువు దోపిడీ
బాధితులు వారి అవసరాన్ని బట్టి అభ్యర్థిస్తున్న క్రమంలో బ్లాక్ మార్కెట్లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభణకు, ఆసుపత్రుల దోపిడీకి అద్దం పడుతుంది . వీరు వారు అన్న తేడా లేకుండా సామాన్యుల నుండి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరూ తమ వారి ప్రాణాలు నిలిపేందుకు బ్లాక్ మార్కెట్ లో అడిగినంత చెల్లించి ఇంజక్షన్ లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది . ప్రభుత్వాలు బ్లాక్ మార్కెట్ పై ఉక్కుపాదం మోపాలని ప్రయత్నాలు చేస్తున్నా అవి ఏమాత్రం ఫలించని పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది .

ప్రభుత్వాలు చెప్పే దానికి క్షేత్ర స్థాయి పరిస్థితులకు పోలిక లేదు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రస్తుతానికి వైద్య సదుపాయాల కొరత ఏమీ లేదని , అన్ని ఆసుపత్రులలో కరోనా వైద్యానికి కావలసిన మందులు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వాలు చెబుతున్నా, గ్రౌండ్ రియాలిటీ లో మాత్రం అలా కనిపించడం లేదు. యాంటి బయాటిక్స్ మందుల నుండి, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్స్ వరకు ఏది కొనాలన్నా సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది .ఆస్తిపాస్తులు అమ్ముకొని, బంగారాన్ని తాకట్టు పెట్టి, అప్పులు చేసి అయినా తమ వారి ప్రాణాలు కాపాడడం కోసం మందులో రామచంద్రా అంటూ పరుగులు పెడుతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు.

సామాన్యులకు కరోనా వైద్యం అందని ద్రాక్షగా .. ప్రభుత్వాలు స్పందించాలి
కరోనా కట్టడి మాట అటుంచి, విపరీతంగా సాగుతున్న బ్లాక్ మార్కెట్ ను కట్టడి చేసి , అన్ని ఆసుపత్రులలో మందులు అందేలా చేస్తే తప్ప సామాన్యులకు వైద్యం దొరకని పరిస్థితి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికైనా దీనిపై దృష్టి సారించి, కరోనా వైద్యానికి కావలసిన అన్ని మందులను అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు సామాన్య ప్రజానీకం. ముఖ్యంగా చాలా అవసరంగా మారిన
రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ల విషయంలో ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు .
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications