Ind vs SA: సూపర్ 8 వేళ భారత్ కు మరో దెబ్బ..! గాయంతో మరో పేసర్ దూరం..!
స్వదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ (T20 world cup 2026)లో ఇప్పటివరకూ అప్రతిహత విజయాలతో సూపర్ 8కు చేరుకున్న భారత్ (team india) రేపటి నుంచి సూపర్ 8 మ్యాచ్ లు ఆడేందుకు సిద్దమవుతోంది. ఇప్పటివరకూ ఆడిన నాలుగు గ్రూప్ మ్యాచ్ లనూ గెల్చుకున్న టీమిండియా.. సూపర్ 8లో భాగంగా రేపు దక్షిణాఫ్రికాతో తలపడాల్సి ఉంది. ఇలాంటి కీలక సమయంలో జట్టుకు అందుబాటులో ఉండాల్సిన సీనియర్ పేసర్ బౌలర్ గాయపడ్డాడు.
రేపు దక్షిణాఫ్రికా మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో టీమిండియా ప్రాక్టీస్ కొనసాగుతోంది. ఇందులో ప్రాక్టీస్ చేస్తున్న పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ (mohammed Siraj)గాయపడ్డాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కొట్టిన బంతి సిరాజ్ కాలికి బలంగా తాకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో నొప్పి తట్జుకోలేక మైదానం వీడాల్సి వచ్చింది. ఫిజియో పర్యవేక్షణలో సిరాజ్ కు చికిత్స అందిస్తున్నారు. దీంతో ఇప్పటికే టీమిండియాకు ఉన్న పేస్ ఆప్షన్ మరొకటి తగ్గిపోయింది.

ఇప్పటికే దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ సందర్భంగా మరో పేసర్ హర్షిత్ రాణా కూడా ఇలాగే గాయపడ్డాడు. దీంతో ఏకంగా టోర్నీకే దూరం కావాల్సి వచ్చింది. అప్పుడు హర్షిత్ రాణా స్ధానంలో సిరాజ్ ను జట్టులోకి తీసుకున్నారు. అలాగే అమెరికాతో మ్యాచ్ కూ మరో పేసర్ బుమ్రా అనారోగ్యం కారణంగా సిరాజ్ జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు బుమ్రా మాత్రమే జట్టుకు ప్రధాన పేసర్ గా అందుబాటులో ఉన్న పరిస్ధితుల్లో రేపు సిరాజ్ అవసరం పడితే అతను అందులో లేకుండా పోతున్నాడు. సూపర్ 8 వేళ టీమిండియాకు ఇదే పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications