వైసీపీ నేత చెవిరెడ్డికి సర్కార్ బిగ్ షాక్..! మద్యం స్కాంలో కీలక పరిణామం..!
ఏపీ మద్యం స్కాంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ హయాంలో జరిగిందని భావిస్తున్న ఈ స్కాంపై ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న సీఐడీ సిట్ విభాగం పలువురు నిందితుల్ని అరెస్టు చేసింది. అయితే ముందుగా ఊహించినట్లు ఇందులో వైసీపీ కీలక నేతల పాత్రను నిరూపించడంలో విఫలమైందన్న ఆరోపణల నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కేసులో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది.
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న సిట్ అధికారులు ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు పలువురు నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం సంస్థల నుంచి అందుకున్న ముడుపులతో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆయన ఆస్తుల జప్తుకు ప్రభుత్వం అనుమతి కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సిట్ కు చెవిరెడ్డి ఆస్తుల జప్తుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మద్యం స్కామ్‌లో ఇప్పటికే ఇతర నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇదే క్రమంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సిట్ గుర్తించింది. మద్యం కమీషన్ల ద్వారా చెవిరెడ్డి కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. అప్పటి సీఎం జగన్ కు సన్నిహితుడిగా పేరున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈ కేసులో సిట్ ఏ38గా చేర్చింది. మద్యం స్కాం ద్వారా లభించిన డబ్బును గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులకు పంచారనే ఆరోపణలు కూడా చెవిరెడ్డిపై ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఆయన అస్తులు అటాచ్ మెంట్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సిట్ అధికారులు త్వరలోనే చెవిరెడ్డికి చెందిన 65 కోట్లకు పైగా విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే చెవిరెడ్డి కుటుంబానికి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లే భావించాలి.
-
Dry Day: మందు బాబులకు షాక్.. వాహనదారులకు అలర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications