తూర్పుగోదావరిలో ఘోరం: గోదావరిలో బోటు మునక, 40మంది గల్లంతు
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దేవిపట్నం మండలం మంటూరు వద్ద సుడిగాలి ధాటికి ఓ లాంచీ నదిలో కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. పోలవరం నుంచి కొండ మొదలు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాద సమయంలో 60మంది గిరిజనులు ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే ఇందులో 20మంది నదిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నట్టు సమాచారం. మిగతా 40మంది ప్రయాణికులు గల్లంతయినట్టుగా తెలుస్తోంది. కొంతమంది గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దింపినట్టు చెబుతున్నారు. లాంచీని లక్ష్మీ వెంకటేశ్వర సర్వీస్ కంపెనీగా చెందినదిగా గుర్తించారు. ప్రస్తుతం దీని యజమాని రంపచోడవరం పోలీస్ స్టేషనులో ఉన్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications