వైసిపి ఎమ్మెల్యే శంకర్ నారాయణ కారుపై బాంబుదాడి...
వైసిపి ఎమ్మెల్యే శంకర్ నారాయణ కారుపై బాంబుదాడి జరిగింది. పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణపై కొందరు గుర్తుతెలియని దుండగులు బాంబుదాడిచేశారు. అదృష్టవశాత్తు ఈ బాంబు పేలకపోవడం ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో వైసిపి శ్రేణులు ఊపీరి పీల్చుకుంటున్నారు. ఈ సంఘటన గోరంట్ల మండలం గడ్డాం తాండాలో జరిగినట్లు సమాచారం. అయితే శంకర్ నారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే.
ర్యాలీలో భాగంగా: అయితే, ఎమ్మెల్యే గడప గడపకు కార్యక్రమం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గోరంట్ల మండలంలో పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఒక ర్యాలీని కూడా నిర్వహించారు. పార్టీ శ్రేణులందరితో కలిసి ఊరేగింపుగా వెళ్లున్న ఎమ్మెల్యే శంకర్ నారాయణ కారుపై కొందరు గుర్తుతెలియని దుండగులు బాంబులు విసిరారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా గందరగోళ వాతావరణం నెలకొంది.

ఆ బాంబు పేలకపోవడంతో ఆయనకు పెనుప్రమాదం తప్పిందని వైసిపీ శ్రేణులు అంటున్నారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి.. ఈ దాడుల వెనుక ఎవరి హస్తం ఉందనో తేల్చాలని వైసిపి శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపు దర్యాప్తు చేపడుతున్నట్ల పోలీసులు తెలిపారు.
ఎలక్ట్రికల్ డిటోనేటర్‌తో దాడి : పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసిన విషయమేమిటంటే... ఎమ్మెల్యేశంకర్ నారాయణ కారుపై ఎలక్ట్రికల్ డిటోనేటర్ విసిరినట్లు తేలింది. పవర్ సప్లయ్ లేకపోవడం వల్ల అది పేలలేదని పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో డిటోనేటర్ విసిరినట్లు తెలిసిందని గోరంట్ల సిఐ తెలిపారు. దాడి చేసిన వ్యక్తి పేరు గణేష్‌గా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై సమ్రగ విచారణ చేపట్టామని సిఐ తెలిపారు.
ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డా :దేవుడి దయతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డానని, డిటోనేటర్ పేలి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని ఎమ్మెల్యే శంకర్ నారాయణ అన్నారు. నాపై హత్యాయత్నం వెనుకు ఎవరున్నారో తెలుసుకోవాలని, ఈ కుట్రకోణాన్ని చేధించాలని పోలీసులను డిమాండ్ చేశారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications