బీచ్ ఫెస్ట్‌కు రోజా అసభ్య దుస్తులతో వస్తే, మీరు బికినీ వేసినట్లుగా: బోండా తీవ్రవ్యాఖ్య

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, నటి రోజా పైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ సోమవారం నాడు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. బీచ్ లవ్ ఫెస్టివెల్ వివాదం కావడంపై బోండా ఉమ స్పందించారు. రోజా బీచ్ ఫెస్టివెల్‌కు అసభ్య వస్త్రధారణతో వస్తే అరెస్ట్ చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీచ్ ఫెస్టివెల్‌లో అసభ్యతకు తావు లేదని చెప్పారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లు అది బీచ్ లవ్ ఫెస్టివెల్ కాదన్నారు. బీచ్ ఫెస్టివెల్ అన్నారు. ఈ కార్యక్రమానికి రోజా అసభ్య వస్త్రధారణతో వస్తే చర్యలు తప్పవని బోండా ఉమ హెచ్చరించారు.

తెలుగింటి ఆడపడుచులు గర్వంగా చూసే ప్రదర్శనలు మాత్రమే బీచ్ ఫెస్టివెల్‌లో ఉండబోతున్నాయన్నారు. చివరకు మీరు సినిమాల్లో బికిన వేసి డ్యాన్స్ చేసినట్లుగా అశ్లీలతను కూడా ప్రోత్సహించేది లేదని బోండా ఉమ రోజాకు కౌంటర్ ఇచ్చారు.

ఏపీకి వెల్లువలా వస్తున్న పెట్టుబడులు, ఉద్యోగావకాశాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్ష నేత జగన్‌ విశాఖ సభ జరిగిందని మంత్రి పత్తిపాటి పుల్లారావు వేరుగా ఆరోపించారు. జగన్‌ ఎన్ని అడ్డుంకులు సృష్టించినా రాష్ట్రంలో అభివృద్ధి ఆగదని చెప్పారు.

Bonda Uma warns YSRCP MLA Roja

దేశంలో 15 శాతం పెట్టుబడులు సాధించిన రాష్ట్రంగా ఏపీని రిజర్వ్ బ్యాంక్‌ గుర్తించిన విషయం జగన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. తన పార్టీ ఉనికిని కాపాడుకునేందుకే జగన్ విశాఖలో సభను నిర్వహించారన్నారు. ఏపీకి వస్తున్న వేల కోట్ల పెట్టుబడులు జగన్‌కు కనిపించడం లేదా అన్నారు.

జగన్ తన తండ్రిని అడ్డు పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించారన్నారు. నారా లోకేష్ నిరంతరం ప్రజల కోసం పాటుపడతారని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రెండు లక్షల 23వేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ఎన్నికల హామీల్లో ఇప్పటికే సగం నెరవేర్చామని, నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రశ్నే లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+