ఔను... వైసీపీలో చేరుతున్నా: బొత్స షాక్, ఉత్తరాంధ్రలో జగన్‌కు బూస్ట్
విజయవాడ: తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ చెప్పారు. కార్యకర్తలు, నేతలతో చర్చించాక తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే తేదీ ప్రకటిస్తానని చెప్పారు. శుక్రవారం నాడు వైసీపీ నేతలు బొత్సతో చర్చించిన విషయం తెలిసిందే.
పార్టీ ఎప్పుడు మారేది ఇప్పుడే చెప్పలేనని, తనతో నడిచే నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన తర్వాత వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. తాను ఏం చేసినా డైరెక్టుగానే చేస్తానని చెప్పారు. కాగా, ఓ విమానాశ్రయంలో ఆయనకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తదితరులు స్వాగతం పలికారు.

దొంగలు దొంగల పార్టీలోనే చేరతారని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి ధ్వజమెత్తారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైసీపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలపై వివేకా పైవిధంగా స్పందించారు.
కాంగ్రెస్ పార్టీని ఎంతోమంది పొడిచి వెళ్లి పోయారని, ఈ దశలో బొత్స కూడా ఒక పోటు పొడుస్తున్నాడని మండిపడ్డారు. ఆయన పార్టీలో ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ ఎక్కడా గెలిచింది లేదని, పోయినంత మాత్రాన ఓడేదీ లేదన్నారు. అయితే దొంగ ఎప్పటికైనా దొంగల పార్టీలోకే చేరతారని బొత్స నిరూపించారని మండిపడ్డారు. కాగా, బొత్స చేరికతో ఉత్తరాంధ్రలో జగన్ పార్టీకి కొత్త ఊపు వస్తుందని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications