రాజకీయ వారసురాలను ప్రకటించిన బొత్సా, తొలి పోటీ అక్కడే - జగన్ ఏం చెప్పారంటే..!!
వైసీపీ సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ కీలక ప్రకటన చేసారు. తన రాజకీయ వారసురాలిని ప్రకటించారు. రాజకీయంగా తన వారసురాలిగా తన కుమార్తె ఉంటారని వెల్లడించారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో తన కుమార్తె రాజకీయంగా ఎంట్రీ ఇస్తారని వివరించారు. తన కుమార్తె పోటీ పైనా క్లారిటీ ఇచ్చారు. అయితే, వచ్చే ఎన్నికల్లో బొత్సా పోటీ పైన ఇంకా స్పష్టత రాలేదు. మాజీ సీఎం జగన్ నిర్ణయం ఇక్కడ కీలకంగా మారుతోంది. ఇదే సమయంలో బొత్సా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి కరంగా మారాయి.
శాసన మండలిలో విపక్ష నేత బొత్సా సత్యనారాయణ తన కుమార్తె పొలిటికల్ ఎంట్రీ పైన స్పష్టత ఇచ్చారు. తన రాజకీయ వారసురాలిగా బొత్సా అనూష ఉంటారని చెప్పారు. త్వరలో జరిగే జిల్లా పరిషత్ ఎన్నికల్లో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో అనూష బరిలో ఉంటుందని వెల్లడించారు. డాక్టర్ చదివిన అనూష రాజకీయంగా యాక్టివ్ అవుతారని వెల్లడించారు.

అయితే, బొత్సా రాజకీయంగా రిటైర్మెంట్ పైనా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బొత్సా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం పైనా ఇంకా చర్చ సాగుతోంది. బొత్సా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా.. పార్టీకి సేవలు అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, మాజీ సీఎం జగన్ మాత్రం వచ్చే ఎన్నికల్లో బొత్సా పోటీలో ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది.
రాజకీయంగా బొత్సా తన కుమార్తెను జిల్లా పరిషత్ ఎన్నికల్లో బరిలోకి దింపుతున్నారు. ఆయన కుమారుడు సైతం వైద్యుడు. గత ఎన్నికల్లో బొత్సా సతీమణి సైతం విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసారు. బొత్సా సహా.. ఆయన కుటుంబం నుంచి పోటీ చేసిన అందరూ ఓడిపోవటం తో... వచ్చే ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నారు. కాగా.. జగన్ మాత్రం వచ్చే ఎన్నికల్లో సీనియర్లే పోటీ చేయాలని.. వారి వారసులకు స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

బొత్సాకు ఇదే సూచన చేసారని పార్టీ నేతల సమాచారం. 2024 లో వైసీపీ ఓటమి తరువాత విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవ ఎన్నికైన బొత్సా.. ప్రస్తుతం శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. వచ్చే వారం స్థానిక ఎన్నికల పైన పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో వారసులకు సీట్లు.. పోటీ పైన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications