టీ మాకు ప్రత్యర్థులే ఉండరు, పొత్తులుండవు: బొత్స
హైదరాబాద్: తెలంగాణలో తమకు ప్రత్యర్థులే ఉండరని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెసు గురించి తప్ప వేరే పార్టీ గురించి ఆలోచించడం లేదని ఆయన సోమవారంనాడు అన్నారు. అందుబాటులో ఉన్న నాయకులతో ఆయన మున్సిపల్ ఎన్నికల గురించి చర్చించారు.
సీమాంధ్రకు ఇచ్చిన ప్యాకేజీని ప్రజలు అర్థం చేసుకుంటే తమకు అక్కడ కూడా ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఉండాలా, వద్దా అనేది ఆ పార్టీ నాయకుల ఇష్టమని ఆయన న్నారు. రాష్ట్రంలోని అన్ని చోట్లా పోటీ చేస్తామని ఆయన చెప్పారు.

త్వరలో జరగనున్న మున్సిపిల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. కార్పోరేషన్, పురపాలక సంఘాల అభ్యర్థుల ఎంపికను స్థానికంగానే ఖరారు చేస్తారని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర కాంగ్రెసుకు చెందిన నాయకులంతా పాల్గొంటారని పార్టీ వర్గాలంటున్నాయి.
మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ తమ పార్టీకి పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ కేవలం పర్యవేక్షణ మాత్రమే చేస్తుందని చెప్పారు తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెసు విభజన నిర్ణయం తీసుకుందని చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసమే కొందరు పార్టీని వీడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications