పూణేలో నందిగామ యువతి ఆత్మహత్య, దర్యాప్తు

నందిగామ యువతిని పాతికేళ్ల ఖజాబీ మునిబ్ మొహమ్మద్‌గా గుర్తిచారు. ఆమెకు మధిక యువకుడితో మూడేళ్ల క్రితం వివాహం జరిగినట్లు తెలుస్తోంది. బిపివో కార్యాలయంలో పనిచేస్తున్న ఆ యువతి వాకడ్‌లోని మంగళ్‌నగర్‌లో గల తన అద్దె ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్ ఏదీ లభించలేదు.
శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఇంటి యజమాని కూతురైన నాలుగేళ్ల అమ్మాయి యువతి ఖజాబీ సీలింగ్‌కు వేలాడుతూ కనిపించడాన్ని గమనించి తండ్రికి చెప్పింది. అతను పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు యువతిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చారు. యువతి మరణంపై పోలీసులు ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. ఖజాబీ భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.












Click it and Unblock the Notifications