రాజధాని అమరావతి ఉద్యమానికి బ్రేక్.. అమరావతి రైతుల సంచలన నిర్ణయం!!
1560 రోజులుగా రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తున్న అమరావతి రైతులు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో రైతులు రాజధాని ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించారు. ఈ మేరకు అమరావతి ఉద్యమకారులకు, రాజధాని ప్రాంత మహిళలకు, రైతులకు, రైతు కూలీలకు, రాజధాని ఉద్యమంలో పాల్గొంటున్న, రాజధాని ఉద్యమానికి తమ సహకారాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ మేరకు ఐక్యకార్యచరణసమితి రాజధాని ఉద్యమానికి తాత్కాలికంగా విరమణ ప్రకటిస్తున్నామని సందేశాన్ని పంపింది.
1560 రోజులుగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా రాజధాని అమరావతి కోసం ఉద్యమించిన ప్రతి ఒక్కరి స్ఫూర్తిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది ఐక్య కార్యాచరణ సమితి. అయితే పోలీసుల సూచన మేరకు తాత్కాలికంగా రాజధాని ఉద్యమానికి విరామం ప్రకటించామని, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఎన్నికల సంఘం ఆదేశాలతో, పోలీసుల సూచనలతో బహిరంగ సమిష్టి నిరసన కార్యక్రమాలకు తాత్కాలికంగా బ్రేక్ వేస్తున్నామని జేఏసీ నేతలు వెల్లడించారు.

అయితే ఏ విధంగా అయితే కరోనా లాక్డౌన్ సమయంలో ఇళ్ల వద్ద నుండి నిరసన కార్యక్రమాలు చేపట్టారో, అదేవిధంగా ఇప్పుడు కూడా ఇళ్ల దగ్గర నుండి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది. తదుపరి కార్యాచరణ పరిస్థితులకు అనుగుణంగా వెల్లడి చేస్తామని పేర్కొన్నారు.
ఎన్ని ఆటంకాలు కల్పించిన, పోలీస్ కేసులు పెట్టి అరెస్టులు చేసిన, తుఫానులు, కరోనా మహమ్మారి లాక్ డౌన్ లు వంటి ప్రకృతి విపత్తులు ఇబ్బంది పెడుతున్నా రాజధాని అమరావతి కోసం ఉద్యమం కొనసాగిందని, అన్యాయం పై అమరావతి రైతులు సాగిస్తున్న పోరాటం అజరామరమని పేర్కొన్నారు జేఏసీ నేతలు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి 2019 డిసెంబర్ 17వ తేదీన అసెంబ్లీలో మూడు రాజధానులు ప్రకటన చేసినప్పటి నుంచి రాజధానికి అమరావతిని మాత్రమే కొనసాగించాలని రైతులు నిరసనలు ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటివరకు రైతులు తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. రాజధానిగా అమరావతి నే కొనసాగించాలని పాదయాత్రలు, ర్యాలీలు, ధర్నాలు ఆందోళనలు, వినూత్న నిరసనలు, విజ్ఞాపనలు, న్యాయ పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇక ప్రస్తుతం కూడా పూర్తిగా నిరసనలను ఆపడం లేదని, తాత్కాలిక విరామాన్ని మాత్రమే ప్రకటిస్తున్నామని, అయితే ఇళ్ల వద్ద ఎవరికి వారు ఆందోళనలు కొనసాగించవచ్చని స్పష్టం చేశారు. అమరావతిని మాత్రమే రాజధానిగా ప్రకటించే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications