ఫస్ట్‌నైట్ రోజు ఊహించని షాక్ ఇచ్చిన నవవధువు.. స్వీట్స్ తెచ్చే గ్యాప్ లోనే !
జీవితం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో ఎవరూ చెప్పలేరు. బంధువులు, అతిధులు.. మేళతాళాల మధ్య అంగరంగ వైభవంగా ఉదయాన్నే ఆ ఇంట పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. కట్ చేస్తే రాత్రి కల్లా ఊహించని ఘటనతో వారి కుటుంబంలో తీరని విషాదం మిగిలింది. ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం...
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మణికంఠ కాలనీలో నివసిస్తున్న.. కృష్ణమూర్తి - వరలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె హర్షితకు కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి చెందిన నాగేంద్రతో 2025 ఆగస్టు 4న (సోమవారం) అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. అదే రోజు రాత్రి వధూవరులకు శోభనం ఏర్పాట్లు చేశారు.

కాగా స్వీట్లు తీసుకొచ్చేందుకు నాగేంద్ర బయటకు వెళ్లారు. మిగతా వారంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నట్టు చెబుతున్నారు. అయితే శోభనం గది లోపల ఉన్న యువతి ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు తలుపులు పగలగొట్టి చూడగా..హర్షిత శోభనం గదిలో ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది.
అప్పటివరకు కళ్ల ముందు కనిపించిన నవవధువు హర్షిత.. ఒక్కసారిగా అలా చేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు షాక్ అయ్యారు. వెంటనే ఆమెను పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
పెళ్లి ఇంట్లో ఇంకా పారాణి కూడా ఆరకముందే వధువు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాద ఘటనతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ మొదలుపెట్టిన పోలీసులు, హర్షిత ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటని దర్యాప్తు చేపట్టారు. మానసిక ఒత్తిడా? బలవంతపు వివాహమా? లేక మరేదైనా ఆత్మహత్యకు దారితీసే కారణం ఉందా అనే కోణాల్లో విచారణ చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
అయితే ఘటన జరిగిన వెంటనే, వరుడు నాగేంద్రతో పాటు అతని కుటుంబ సభ్యులు వివాహ గృహం నుంచి వెళ్లిపోయారు. వధువు హర్షిత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన ఏపీ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications