కోడికూర వండలేదని, సొంత చెల్లినే కిరాతకంగా హతమార్చిన అన్న; ఏపీలో ఘటన
సమాజంలో నేరప్రవృత్తి రోజురోజుకీ పెరుగుతోంది. మానవ సంబంధాలను, అనుబంధాలను మరిచిపోయి హత్యలకు పాల్పడుతున్న వాళ్లు అనునిత్యం సమాజంలో కనిపిస్తున్నారు. చిన్నచిన్న కారణాలకే ప్రాణాలు తీస్తున్న వారు కుటుంబాలకు కుటుంబాలను నాశనం చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కూనవరం మండలంలో కేవలం కోడి కూర వండ లేదని సొంత చెల్లెలినే అన్న అత్యంత దారుణంగా హతమార్చాడు.

అర్దరాత్రి కోడికూర వండాలని చెల్లెలికి అన్న హుకుం
ఈ ఘటన వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా కూనవరం మండలం కన్నాపురం కి చెందిన కొవ్వాసి నంద అనే వ్యక్తి కూలి పని చేసి జీవనం సాగిస్తున్నాడు. అతనికి 30 సంవత్సరాల వయసున్న చెల్లెలు సోమమ్మ ఉంది. ఇటీవల తన అన్నను చూడటం కోసం తెలంగాణలోని కరకగూడెం మండలం మాదన్న గూడెం నుంచి సోమమ్మ వచ్చింది. ఆడపడుచు ఇంటికి వచ్చిన తరువాత, నంద భార్య రెండు రోజులు తన పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్ళింది. భార్య ఊరికి వెళ్ళగానే నందా బాగా మద్యం సేవించి, రాత్రి సమయంలో చికెన్ తీసుకొచ్చి, అప్పటికప్పుడు కోడి కూర వండాలి అని చెల్లెలు సోమమ్మ కు సూచించాడు.

కోడికూర వందలేదని చెల్లెలితో గొడవ పడిన అన్న
తనకు ఆరోగ్యం బాగోలేదని, ఈ సమయంలో కూర వండే లేనని చెల్లెలు చెప్పింది. మద్యం తాగి కూర వండమని అంటున్నాడని అన్నను కాస్త విసుక్కుంది. అయినప్పటికీ తాను బయటకు వెళ్తున్నానని, తిరిగి వచ్చేలోపు కూర వండాలని అన్న నంద చెల్లెలికి హుకుం జారీ చేశాడు. తాగిన మత్తులో అన్న ఏదో చెప్పాడని భావించిన నంద చెల్లెలు సోమమ్మ అన్న హుకుం పట్టించుకోకుండా నిద్ర పోయింది. ఫుల్లుగా మద్యం తాగిన నంద, తిరిగి శుక్రవారం తెల్లవారుజామున ఇంటికి వచ్చి కోడి కూర ఎందుకు పడలేదని చెల్లెలు సోమమ్మతో గొడవ పడ్డాడు.

చెల్లిని గొడ్డలితో నరికి చంపిన అన్న నంద .. పోలీస్ కేసు నమోదు
పట్టలేని ఆగ్రహంతో సోమమ్మ పై దాడి చేశాడు. అన్న తన పై దాడి చేస్తాడని ఊహించని సోమమ్మ ఒక్కసారిగా షాక్ కు గురైంది. బిగ్గరగా అరుస్తూ బయటకు పరుగులు తీసింది. అయినప్పటికీ వదిలిపెట్టకుండా చెల్లెలు సోమమ్మని వెంటపడి అన్న నంద గొడ్డలితో అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఇరుగు పొరుగు వారు నిందితున్ని పట్టుకొని చెట్టుకు కట్టేశారు. ఆపై పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నంద పై హత్య కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మితిమీరిన కోపం, మద్యపానం, క్షణికావేశం ఫలితంగా కటకటాలపాలైన అన్న
విపరీతంగా మద్యం సేవించడం, విపరీతమైన కోపం కారణంగా నంద తన చెల్లెల్ని హతమార్చి హంతకుడిగా మారి కటకటాలపాలయ్యాడు. రెండు రోజులు అన్న ఇంట్లో ఉందామని వచ్చి అనవసరంగా ప్రాణాలు కోల్పోయిన చెల్లెలు సోమమ్మ కుటుంబంలో చిచ్చు పెట్టాడు. సోమమ్మ మృతితో ఆమె కుటుంబం కన్నీరు మున్నీరుగా రోదిస్తోంది. క్షణికావేశం వల్ల తన జీవితాన్ని, తన చెల్లెలు జీవితాన్ని నాశనం చేసి చివరకు నంద జైలు పాలయ్యాడు .
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications