జగన్‌ను దాటి వెళ్లగలరా..?!

అమరావతి: ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. మొన్నటి వరకు మనుగడలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి- భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన తరువాత ఇక పార్టీ విస్తరణ కార్యకలాపాలపై కసరత్తు చేస్తోన్నారు. అటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిరాటంకంగా కొనసాగిస్తూనే- జాతీయ రాజకీయాలకు మరింత పదును పెడుతున్నారు..క్రియాశీలకంగా వ్యవహరించబోతోన్నారు.

ఖమ్మం సభలో కీలక ప్రసంగం..

ఖమ్మం సభలో కీలక ప్రసంగం..

ఖమ్మం సభలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తనదైన శైలిలో విమర్శలు సంధించారు. బీఆర్ఎస్ ఆవిర్భావానికి గల కారణాలనూ వెల్లడించారు. తనకు ఇష్టమైన వారి కోసం మోదీ ప్రైవేటైజేషన్ విధానాన్ని అనుసరిస్తోన్నారని, 43 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్న ఎల్‌ఐసీని కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తోందని గుర్తు చేశారు.

మోదీ ఓటమి ఖాయం..

మోదీ ఓటమి ఖాయం..

2024 తరువాత ప్రధాని మోదీ ఇంటికి వెళ్లడం ఖాయమని, తాము ఢిల్లీకి వెళ్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తమ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాబోతోందని అన్నారు. రైతులు, శ్రామికులు, కర్షకులు..బీఆర్ఎస్ కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మత విధ్వేషం మంటల మధ్య కేంద్ర ప్రభుత్వం యువతను, వారి భవిష్యత్తును నాశనం చేస్తోందని మండిపడ్డారు. ఇకపై అలాంటి విన్యాసాలు చెల్లబోవని హెచ్చరించారు.

రియాక్షన్స్ షురూ..

రియాక్షన్స్ షురూ..

కేసీఆర్ చేసిన ప్రసంగం పట్ల ఏపీలో రియాక్షన్లు మొదలయ్యాయి. పలువురు నాయకులు స్పందిస్తోన్నారు. కేసీఆర్ ప్రసంగంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడారు. అంత పెద్ద సభ పెట్టినందున ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడినట్లే ఉందని వ్యాఖ్యానించారు. ఏపీ రాజకీయాలపై కేసీఆర్ గానీ, బీఆర్ఎస్ గానీ ఎలాంటి ప్రభావాన్ని చూపబోదని స్పష్టం చేశారు.

జగన్ ను దాటి వెళ్లగలరా?

జగన్ ను దాటి వెళ్లగలరా?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో ఎక్కడే గానీ వ్యతిరేకత కనిపించట్లేదని, అలాంటప్పుడు మరో పార్టీ వైపు ఎందుకు చూస్తారని పేర్ని నాని విలేకరులను ప్రశ్నించారు. పేదలు, అణగారిన వర్గాలు, బడుగు-బలహీన వర్గాల ఆదరణను వైఎస్ జగన్ చూరగొన్నారని, ఆయనను దాటుకుని కేసీఆర్ వెళ్లగలరా? అని అన్నారు. అది సాధ్యం అయ్యే పని కాదని చెప్పారు. ఏ ఆర్ఎస్ కూడా ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయలేదని వ్యాఖ్యానించారు. దేశ రాజకీయాల్లో మార్పు ఎలా సాధ్యపడుతుందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+