అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!!

అమరావతి బిల్లు పై చర్చ వేళ పార్లమెంట్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. లోక్ సభ లో ఆమోదం తరువాత ఈ రోజు రాజ్యసభలో బిల్లును ప్రతిపాదించారు. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. పార్లమెంట్‌ ఆమోదంతో రాష్ట్రపతి వద్దకు బిల్లు వెళ్లనుంది. రాష్టపతి సంతకం తరువాత ఏపీ రాజధానిగా అమరావతికి చట్ట బద్దత రానుంది. ఇదే సమయంలో రాజ్యసభలో అమరావతి పై చర్చ వేళ బీఆర్ఎస్ అనూహ్య నిర్ణయం ప్రకటించింది.

అమరావతి బిల్లు పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అటు లోక్ సభ.. ఇటు రాజ్యసభలో వైసీపీ వాకౌట్ చేసింది. అమరావతికి వ్యతిరేకం కాదని చెబుతూనే... బిల్లుకు ప్రస్తుత స్వరూపంలో మద్దతు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. కాగా.. బీఆర్ఎస్ నిర్ణయం ఇప్పుడు ఆసక్తి కర చర్చకు కారణంగా మారుతోంది. అమరావతికి బీఆర్‌ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. అమరావతి బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కాలేశ్వరం అని అన్నారు. ప్రభుత్వ నిధులతో పాటు రుణాలతో కాలేశ్వరం కట్టామని వివరించారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా కాలేశ్వరం నిర్మించామని చెప్పుకొచ్చారు. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యలు చేశారు.

brs-members-supports-amaravati-legislation-bill-in-rajysabha-as-party-chief-kcr-decision-here-the-d

అమరావతికి నాడే కేసీఆర్ మద్దతుగా

అదే సమయంలో బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి మాట్లాడుతూ.. అమరావతికి గతంలోనే కేసీఆర్‌ మద్దతు తెలిపారన్నారు. అమరుల త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. దేశంలోనే తెలంగాణను నెంబర్‌ వన్‌ గా నిలబెట్టామన్నారు. ప్రాంతాల వారీగా వేరైనా అన్నదమ్ము ల్లా కలిసుందామని కేసీఆర్‌ అన్నారని వెల్లడించారు. కనీసం చర్చ లేకుండా 7 మండలాలను ఏపీలో కలిపారని.. విభజన తీరుపై బీజేపీ తరచూ విమర్శలు చేస్తోందని అన్నారు. తల్లిని చంపి బిడ్డను తీశారన్నట్లు మాట్లాడారని సురేశ్‌ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇదే సభలో వైసీపీ పార్టీ పక్ష నేత వైవీ సుబ్బారెడ్డి బిల్లు పైన తమ అభ్యంతరాలు వ్యక్తం చేసారు. రైతులకు ఎప్పటి లోగా ప్లాట్లు తిరిగి ఇస్తారనే అంశం లేదని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన చేసారు. బిల్లు అసమగ్రంగా ఉందని చెబుతూ... రాజ్యసభ నుంచి వాకౌట్ చేసారు. కాగా.. ఇదే సమయంలో బీఆర్ఎస్ మద్దతు ఇవ్వటం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+