గురజాలలో దారుణం; గుర్తు తెలియని మహిళపై అగంతకుల సామూహిక అత్యాచారం

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా కామాంధులు భయం లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. నిత్యం ఎక్కడో ఒకచోట మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి. చేస్తుంది తప్పు అని ఏ మాత్రం భయం లేని మానవ మృగాలు నిత్యం మహిళల ధన, మాన, ప్రాణాలను దోచుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి దారుణ ఘటన చోటు చేసుకుంది.

గురజాల రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని మహిళపై గ్యాంగ్ రేప్

గురజాల రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని మహిళపై గ్యాంగ్ రేప్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గురజాల రైల్వే స్టేషన్ లో ఒక గుర్తుతెలియని మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. గురజాల రైల్వే స్టేషన్ లో ఒక మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండడం గుర్తించిన కొందరు వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స తరువాత స్పృహలోకి వచ్చిన మహిళ తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్లు చెబుతోంది.

అత్యాచారానికి గురైన సదరు మహిళ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. ఆ మహిళకు రెండేళ్ల వయసున్న ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆమెకు చికిత్స అందించిన వైద్యురాలు సదరు మహిళ మాట్లాడుతున్న భాష ఏమిటో సరిగ్గా అర్థం కాక పోవడం వల్ల అసలు ఏం జరిగింది అనేది తెలియడం లేదని వెల్లడించారు.

రైల్వే స్టేషన్ లో రెండేళ్ళ కొడుకుతో ఉన్న మహిళ.. ఇద్దరు అగంతకుల అత్యాచారం

రైల్వే స్టేషన్ లో రెండేళ్ళ కొడుకుతో ఉన్న మహిళ.. ఇద్దరు అగంతకుల అత్యాచారం

పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళితే, వేరే ప్రాంతానికి వెళ్లేందుకు మహిళ రైల్వే స్టేషన్లో వేచి ఉన్న సమయంలో గుర్తు తెలియని అగంతకులు మహిళను సమీప నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టారు.

రాత్రి సమయం కావడంతో ఎవరు ఈ ఘటనను గుర్తించలేకపోయారు. ఉదయం అటుగా వెళుతున్న కొంతమంది అపస్మారక స్థితిలో ఉన్న మహిళను ఆసుపత్రికి తరలించి, దీంతోపాటుగా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

మహిళ ఎవరు ? అత్యాచారం చేసింది ఎవరు? అన్న దానిపై దర్యాప్తు

మహిళ ఎవరు ? అత్యాచారం చేసింది ఎవరు? అన్న దానిపై దర్యాప్తు

ఇక ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఆమె ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతుంది? ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టిన ఆగంతకులు ఎవరు? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా రాత్రి సమయంలో మహిళలు బయటకు వెళితే రక్షణ లేని పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు మహిళల భద్రతను పదేపదే ప్రశ్నిస్తున్నాయి. నిర్భయ, దిశ వంటి చట్టాలు కూడా మృగాళ్ళలో ఎలాంటి మార్పును తీసుకురాలేక పోతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+