పుష్ప అడవుల్లో అర్ధరాత్రి విద్యార్దుల మిస్సింగ్-సుడిగుండంలో క్లాస్ మేట్ బలి..!
తిరుపతి జిల్లాలోని శేషాచలం అడవులకు వెళ్లిన ఆరుగురు బీటెక్ విద్యార్ధుల విహార యాత్ర విషాదంగా ముగిసింది. అడవిలో వాటర్ ఫాల్స్ అందాలను చూసేందుకు వెళ్లిన వారిలో ఒకరు చనిపోగా.. మిగిలిన వారు అర్ధరాత్రి తప్పిపోయారు. నానా కష్టాలు పడ్డాక చివరికి పోలీసులు వారిని కాపాడారు. దీంతో హమ్మయ్య అనుకుంటూ వారు ఇళ్లకు చేరుకున్నారు. రాష్ట్రంలో కలకలం రేపిన ఈ ఘటన వివరాలు ఓసారి చూద్దాం..
శ్రీకాహళహస్తికి చెందిన ఆరుగురు బీటెక్ విద్యార్ధులు శేషాచలం అడవుల్లో ఉన్న వాటర్ ఫాల్స్ ను చూద్దామని నిన్న ఉదయం వెళ్లారు. వాటర్ ఫాల్స్ లోకి దిగి కాసేపు ఉల్లాసంగా గడిపారు. అయితే అంతలోనే అక్కడ ఉన్న సుడిగుండంలో పడి సాయిదత్త అనే విద్యార్థి చనిపోయారు. దీంతో భయ భ్రాంతులైన మిగతా ఐదుగురు అడవుల్లోకి వెళ్లారు. అక్కడ వీరు దారి తప్పిపోయారు. ఓవైపు రాత్రి కావడం, దారి తెలియకపోవడంతో అర్దరాత్రంతా అక్కడే తిరుగుతూ ఉండిపోయారు. ఎటువెళ్లాలో తెలియదు, ఫోన్ సిగ్నల్స్ పనిచేయడం లేదు, ఇలాంటి పరిస్ధితుల్లో బీటెక్ విద్యార్ధులకు చివరిగా ఓ దారి దొరికింది.

అడవుల్లోనే కాస్త సిగ్నల్ వచ్చే ప్రాంతానికి వెళ్లి అక్కడి నుంచి పోలీసులకు కాల్ చేసి సంప్రదించారు. దీంతో పోలీసులు కూడా షాకయ్యారు. చివరికి విద్యార్ధులు అడవిలో తాము ఉన్న లొకేషన్ ను పోలీసులకు షేర్ చేశారు. దీంతో రైల్వే కోడూరు పోలీసులు, స్థానిక అటవీ అధికారులతో కలిసి వారిని చేరుకున్నారు. అర్ధరాత్రి వేళ అడవిలోకి వెళ్లి మరీ వారిని కాపాడారు. ఉదయానికి బీటెక్ విద్యార్ధుల్ని తీసుకుని అడవిలో నుంచి బయటికి వచ్చారు. రైల్వే కోడూరు పీఎస్ కు తీసుకొచ్చి వారి తల్లి తండ్రులకు అప్పగించారు. దీంతో కథ సుఖాంతమైంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications