Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎవరు వెన్నుపోటుదారులో బహిరంగచర్చకు సిద్ధం: కొడాలి నాని టార్గెట్ గా బుద్దా వెంకన్న సవాల్!!

తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టిడిపి జెండాను ఎగరేసిన బుద్దా వెంకన్న, నాగుల్ మీరా లు వైసిపి నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని కొంతమంది వెధవలు ప్రచారం చేస్తున్నారని మండిపడిన బుద్దా వెంకన్న, పార్టీ అడ్రస్ లేకుండా పోతుందనే ఆవేదనతో ఆనాడు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, నాడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబుకు మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు.

లోకేష్ ను పప్పంటావా.. మీ నాయకుడు గన్నేరు పప్పు: బుద్దా వెంకన్న

లోకేష్ ను పప్పంటావా.. మీ నాయకుడు గన్నేరు పప్పు: బుద్దా వెంకన్న

ఇక వెన్నుపోటు రాజకీయాలకు జగన్ కేరాఫ్ అడ్రస్ అని పేర్కొన్న బుద్దా వెంకన్న, వెన్నుపోటు అంటే జగన్ కి బాగా తెలుసు అంటూ వ్యాఖ్యలు చేశారు. తండ్రిని బెదిరించి మరీ బాబాయ్ వివేకానంద రెడ్డి ని జగన్ వెన్నుపోటు పొడిచారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ఇక కొడాలి నాని ని టార్గెట్ చేసిన బుద్దా వెంకన్న లోకేష్ ను పప్పు అని కూతలు కూసే కొడాలి నాని మీ నాయకుడు గన్నేరు పప్పు ఆ వాస్తవం తెలుసుకో అంటూ బుద్దా వెంకన్న చురకలంటించారు.

కొడాలి నాని లాంటి నీచమైన వ్యక్తులను తరిమికొట్టాలి: బుద్దా వెంకన్న

కొడాలి నాని లాంటి నీచమైన వ్యక్తులను తరిమికొట్టాలి: బుద్దా వెంకన్న

చంద్రబాబు విశ్వాసం లేని కొడాలి నాని లాంటి కుక్కలను పెంచి పోషించారని బుద్ధ వెంకన్న అసహనం వ్యక్తం చేశారు. కొడాలి నాని లాంటి నీచమైన వ్యక్తులను తరిమికొట్టాలని పేర్కొన్న బుద్దా వెంకన్న ఎన్టీఆర్ గురించి మాట్లాడే కొడాలి నాని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను సిగ్గు లేకుండా తిడుతున్నాడు అంటూ మండిపడ్డారు. 1999లో గుడివాడలో హరికృష్ణ ను నాలుగో స్థానానికి పడేసిన కుట్ర చేసింది కొడాలి నానినే అంటూ బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎవరు వెన్నుపోటుదారులో బహిరంగ చర్చకు సిద్ధం.. ఏ సన్నాసులు వస్తారో రండి

ఎవరు వెన్నుపోటుదారులో బహిరంగ చర్చకు సిద్ధం.. ఏ సన్నాసులు వస్తారో రండి

వీరులు పుట్టిన గడ్డ లో కొడాలి నాని లాంటి సన్నాసులు ఎలా పుట్టారంటూ విమర్శించిన బుద్దా వెంకన్న గుండీలు విప్పి రంగులేస్తే నాయకుడివి అయిపోతావా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు జగన్ ఎవరు వెన్నుపోటుదారులో బహిరంగ చర్చకు తాము సిద్ధమని, ఏ సన్నాసులు వస్తారో రావాలని బుద్ధ వెంకన్న సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీని కాపాడి అధికారంలోకి తెచ్చిన చంద్రబాబు వెన్నుపోటు దారుడా? లేక బాబాయ్ ని చంపిన వారిని కాపాడుతున్న మీ నాయకుడు వెన్నుపోటు దారుడా? చెప్పాలని డిమాండ్ చేశారు.

సొంత చెల్లికే జగన్ వెన్నుపోటు

సొంత చెల్లికే జగన్ వెన్నుపోటు

తండ్రిని హతమార్చిన వారిని శిక్షించాలని కోరిన చెల్లెలికి జగన్ ఏమి న్యాయం చేశారో చెప్పాలన్నారు. తన విజయం కోసం పని చేసిన సొంత చెల్లినే జగన్ వెన్నుపోటు పొడిచారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. జగన్ లాగా చంద్రబాబు ఎవరైనా చంపించారా? అని ప్రశ్నించిన బుద్దా వెంకన్న, చంద్రబాబు రౌడీ రాజకీయం చేసే వాడే అయితే కొడాలి నాని నోరు లేచేది కాదని పేర్కొన్నారు. హత్య రాజకీయాల చరిత్ర జగన్ కు ఉందని బుద్దా వెంకన్న మండిపడ్డారు.

కొడాలి నాని లాంటి వాళ్ళు కుక్కలా కన్నా హీనం

కొడాలి నాని లాంటి వాళ్ళు కుక్కలా కన్నా హీనం

ఇక ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి అని పేర్కొన్న బుద్దా వెంకన్న చంద్రబాబుని తిట్టే నానీ లాంటి వాళ్ళు కుక్కలకన్నా హీనం అంటూ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించకుండా సభలో లేని చంద్రబాబును తిట్టటానికి సమయం కేటాయిస్తారా అంటూ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి లాంటి సీఎం, కొడాలి నాని లాంటి మంత్రులు ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం అంటూ బుద్దా వెంకన్న మండిపడ్డారు.

 కొడాలి నానీ మాటలే ఆయన నాశనానికి నాంది

కొడాలి నానీ మాటలే ఆయన నాశనానికి నాంది

కొడాలి నాని చంద్రబాబుని తిడితే జగన్ దగ్గర మార్కులు పడతాయి అనే భ్రమలో ఉన్నారు అని పేర్కొన్న బుద్దా వెంకన్న కొడాలి నాని పాపాల చిట్టాను ప్రతి టీడీపీ కార్యకర్త రాస్తున్నాడని పేర్కొన్నారు. కొడాలి నానికి బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని పేర్కొన్న బుద్దా వెంకన్న కొడాలి నాని మాటలే, ఆయన నాశనానికి నాంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+