ఏపీలో బుల్లెట్ రైళ్ళ కారిడార్, ఎన్ హెచ్ ప్రాజెక్టుల దూకుడు.. సీఎం చంద్రబాబు కీలకఆదేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు, నేషనల్ హైవే ప్రాజెక్టులలో దూకుడు పెంచాలని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇటీవల మంత్రులు కార్యదర్శితో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో మౌలిక వసతులు, లాజిస్టిక్స్, కేంద్రం నుండి రైల్వే, రోడ్డు ప్రాజెక్టులలో జరిగే అభివృద్ధి పనుల పైన ఆయన కీలక ఆదేశాలు ఇచ్చారు.

రైల్వే, రవాణా ప్రాజెక్టులకు భూసేకరణపై చంద్రబాబు

ఇచ్చాపురం నుంచి నెల్లూరు రైల్వే లైన్ నాలుగు వరుసలకు విస్తరించడానికి, 774 రైల్వే క్రాసింగ్ ల వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ అండర్ బ్రిడ్జిలు నిర్మించడానికి తగిన చర్యలు చేపట్టాల్సిందిగా పేర్కొన్న చంద్రబాబు, ఇవి నిర్మించడం ద్వారా సరుకు రవాణా వేగవంతం అవుతుందని తెలిపారు. రైల్వే, రవాణా ప్రాజెక్టులకు భూసేకరణ గడువు లోపల జరిగేలా చూడాలని చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు.

bullet train corridor and NH projects are progressing rapidly in AP CM Chandrababu key directive

బుల్లెట్ రైలు కారిడార్ లతో ఆంధ్రప్రదేశ్ కు అధిక ప్రయోజనం

వీటిపైన కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి గడువు లోపల భూములను సేకరించాలి అన్నారు. లాజిస్టిక్స్ విషయంలో తమకు సంబంధం లేదు అన్నట్టు కలెక్టర్లు వ్యవహరించకూడదని ఆయన పేర్కొన్నారు.రాజధాని అమరావతి మీదుగా హైదరాబాద్- అమరావతి- చెన్నై, హైదరాబాద్- బెంగుళూరు, చెన్నై- బెంగళూరు బుల్లెట్ రైలు కారిడార్ లతో ఆంధ్రప్రదేశ్ కు అధిక ప్రయోజనం లభిస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

రవాణా వ్యయాన్ని తగ్గించటం తమ లక్ష్యం అన్న చంద్రబాబు

ఏ ప్రాంత పురోగతిలో రవాణా ఖర్చు కూడా కీలకమని, ప్రస్తుతం 14 శాతం ఉన్న రవాణా వ్యయాన్ని, ఏడు నుండి ఎనిమిది శాతానికి తగ్గించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు . రవాణా ఖర్చు తగ్గాలంటే వాటర్ వే అత్యుత్తమమైనది అని, రోడ్లు, రైలు మార్గాలు, ఎయిర్ వేస్ వస్తాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సీ ప్లేన్స్ లో మన రాష్ట్రం దేశంలోనే ఆదర్శం కానుందని చంద్రబాబు పేర్కొన్నారు.

రైలు, రోడ్డు మార్గాల పురోగతి పనుల వేగవంతం

ప్రస్తుతం 400 లక్షల టన్నుల ఉద్యాన పంటలు ఉత్పత్తి చేస్తున్నామని, నాలుగైదు ఏళ్లలో 1000లక్షల టన్నులకు అది వెళుతుందని, ఇదంతా దేశీయ, విదేశీ మార్కెట్లకు వెళ్లాలంటే లాజిస్టిక్స్ సదుపాయం ఉండాలన్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా నుంచి రైళ్లల్లో అరటి రవాణా అవుతోందని, ఇలా అన్ని పంటల పైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. అందుకే రైలు, రోడ్డు మార్గాల పురోగతి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+