IndiGo: పశువుల్లా కుక్కేస్తారా ? కోర్టుకీడుస్తా..! ఇండిగో కు నరేష్ వార్నింగ్..!
దేశంలోనే టాప్ ఎయిర్ లైన్స్ పై పేరు తెచ్చుకుని, తాజాగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఇండిగో విమానయాన సంస్థ తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ కు షాకిచ్చింది. ఇండిగో విమానం ఎక్కేందుకు ఎయిర్ పోర్టు నుంచి ఏర్పాటు చేసే బస్సుల్లో విపరీతంగా ప్రయాణికుల్ని కుక్కేయడంపై నరేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎక్కిన ఇలాంటి ఓ బస్సులో ప్రయాణికుల్ని భారీగా కుక్కేసి తీసుకెళ్లడంపై మండిపడుతూ ఓ ట్వీట్ చేశారు.
ఇండిగో ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకున్న నరేష్ కు ఎయిర్ పోర్టు నుంచి ఏర్పాటు చేసిన బస్సులో సీటు దొరికింది. అయితే ఒకేసారి ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో రావడంతో సదరు బస్సులో వారందరినీ ఎక్కించేశారు. దీంతో నరేష్ తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇండిగో సిబ్బందితో నటుడు నరేష్ గొడవ కూడా పడ్డారు. అయినా వారు స్పందించకపోవడంతో అక్కడి ఫొటోలు తీసుకుని ట్వీట్ పెట్టారు.

The bus torture chambers of INDIGO airlines are excruciating reminders of the airline monopoly. Thy had loaded us like cattle in a lorry (twice the capacity )with senior citizens , some in wheel chairs struggling to stand ( seen in the back ground ) . I had screamed at the top of… pic.twitter.com/JzcOvsLlul
— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) December 23, 2025
ఇందులో ఎయిర్‌లైన్స్ బస్సు టార్చర్ ఛాంబర్‌లు ఎయిర్‌లైన్ గుత్తాధిపత్యాన్ని గుర్తుచేస్తాయని నరేష్ తెలిపారు. మీరు మమ్మల్ని లారీలో పశువులలాగా (సామర్థ్యానికి రెండు రెట్లు) సీనియర్ సిటిజన్లతో ఎక్కించారన్నారు. కొంతమంది వీల్ చైర్‌లలో నిలబడటానికి ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇకపై ఓవర్‌లోడ్ చేయడాన్ని ఆపమని తాను గట్టిగా అరిచినట్లు తెలిపారు. బస్సులకు ఒక నిర్దిష్ట పరిమితి, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక స్థలం ఉండాలన్నారు. దీనిపై చట్టబద్ధంగా ముందుకువెళ్లేందుకు తన న్యాయ బృందంతో మాట్లాడుతున్నానని నరేష్ ట్వీట్ లో పేర్కొన్నారు.
-
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
మీకు అర్థమవుతోందా?.. ‘ధురంధర్2’ తీయడం వెనక పక్కా రాజకీయ వ్యూహం -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
థియేటర్ల దగ్గర తొలిసారిగా 144 సెక్షన్, భారీగా పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు ఈ హీరో సినిమాకే -
దయచేసి నన్ను సినిమాల్లో పెట్టుకోండి: రాజశేఖర్ రిక్వెస్ట్ -
"మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్" -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే? -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
ఉస్తాద్‌కు ధురంధర్ డెంటు పెట్టేసాడుగా..! -
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో












Click it and Unblock the Notifications