అందుకే టిడిపిలో చేరట్లేదు: అంతకుముందు బాబుతో బుట్టా రేణుక, మరికొంతమందీ
కర్నూలు ఎంపి బుట్టా రేణుక తన అనుచరులను మంగళవారం టిడిపిలో చేర్పించారు. తనపై అనర్హతవేటు పడుతుందనే భయంతో ఆమె టిడిపిలో అధికారికంగా చేరలేదు.టిడిపిలో చేరకముందు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బుట్టా రే
Recommended Video

కర్నూలు: కర్నూలు ఎంపి బుట్టా రేణుక తన అనుచరులను మంగళవారం టిడిపిలో చేర్పించారు. తనపై అనర్హతవేటు పడుతుందనే భయంతో ఆమె టిడిపిలో అధికారికంగా చేరలేదు..
టిడిపిలో చేరకముందు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠ మంగళవారం ఉదయం చంద్రబాబును కలిశారు. టిడిపికి మద్దతిస్తున్నట్లుగా ప్రకటించారు. సాంకేతిక కారణాల వల్ల ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించారు.

త్వరలో మరికొందరు వైసిపి నాయకులు టిడిపిలో చేరుతారని బుట్టా రేణుక చంద్రబాబుకు చెప్పారని తెలుస్తోంది. కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి వైసిపి నుంచి టిడిపిలో చేరేందుకు పలువురు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
కాగా, టిడిపిలో చేరుతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. అమరావతిలో చంద్రబాబును కలిసేందుకు అపాయింటుమెంట్ కోరగా మంగళారం ఉదయం తొమ్మిది గంటలకు ఇచ్చారు. పార్టీలో చేరిన అనంతరం కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు మాట్లాడారు.
బుట్టా రేణుక టిడిపిలో చేరుతున్నారని, ఆమెతో కలిసి పని చేయాలని టిడిపి ప్రజాప్రతినిధులకు చంద్రబాబు సూచించారు.
ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డిని సీఎం చంద్రబాబు ఎంపీ రేణుకకు పరిచయం చేశారు.












Click it and Unblock the Notifications