త‌ప్పు చేసాను..శిక్ష అనుభ‌వించాను : వైసిపి లోకి బుట్టా రేణుక‌..మాగుంట : జ‌గ‌న్ తో కొణ‌తాల భేటీ..!

వైసిపిలో వ‌ల‌సల జోరు కొన‌సాగుతోంది. టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి..వైసిపి నుండి గ‌త ఎన్నిక ల్లో క‌ర్నూలు ఎంపిగా గెలిచి టిడిపి లోకి వెళ్లిన బుట్టా రేణుక తిరిగి వైసిపి లో చేరారు. తాను వైసిపి నుండి టిడిపి లోకి వెళ్లి త‌ప్పు చేసాన‌ని..అందుకు శిక్ష అనుభ‌వించాన‌ని రేణుక చెప్పుకొచ్చారు. కొణ‌తాల రామ‌కృష్ణ జ‌గ‌న్ తో భేటీ అయ్యా రు. అయితే ఇంకా పార్టీలో చేర‌లేదు..

త‌ప్పు చేసాను..శిక్ష అనుభ‌వించాను

త‌ప్పు చేసాను..శిక్ష అనుభ‌వించాను

బుట్టా రేణుక తిరిగి వైసిపి లో చేరారు. 2014 ఎన్నిక‌ల్లో వైసిపి నుండి గెలిచి టిడిపిలోకి వెళ్లిన బుట్టా రేణుక అక్క‌డ సీటు ద‌క్క‌క పోవ‌టంతో తిరిగి వైసిపి లో రీ ఎంట్రీ ఇచ్చారు. తాను పొర‌పాటు చేసాన‌ని..దానికి శిక్ష కూడా అనుభ‌వించాన‌ని బుట్టా రేణుక ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేసారు. వైసిపి లో ఉన్న స‌మ‌యంలో చిన్న అపార్ధంతో పార్టీ వీడాన‌ని.. అయితే, అక్క డ‌కి వెళ్లిన త‌రువాత ఆ పార్టీ ఏంట‌నేది అర్ద‌మైంద‌ని చెప్పుకొచ్చారు. టిడిపిలో నేత‌ల‌ను మ‌భ్య‌పెట్టి ..దాచిపెట్టి మాన‌సి కంగా వేధిస్తార‌ని వివ‌రించారు. తాను వైసిపి లోకి తిరిగి భేష‌ర‌తు గా వ‌చ్చాన‌ని..ఏమీ ఆశించ‌టం లేద‌ని స్ప‌ష్టం చేసా రు. అయిదేళ్ల కాలంలోనే తాను రాజకీయంగా అనుభ‌వం సాధించాన‌న్నారు. బిసి మ‌హిళ‌గా త‌నను మోసం చేసార‌ని ఆరోపించారు. ఎవరైనా ఎక్క‌డ ఉన్నారో అక్క‌డ ఉంటేనే గౌర‌వం ఉంటుంద‌న్నారు. మంగ‌ళ‌గిరి బిసిల‌కు ఇవ్వాల్సిన సీటు లోకేష్ కు కేటాయించ‌టాన్ని త‌ప్పు బ‌ట్టారు.

ఒంగోలు ఎంపీగా మాగుంట‌..

ఒంగోలు ఎంపీగా మాగుంట‌..

టిడిపి ఎమ్మెల్సీ ప‌ద‌వికి..పార్టీకి రాజీనామా చేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసిపి లో చేరారు. టిడిపి నుండి ఒంగో లు ఎంపీగా పోటీ చేయాల‌ని ముఖ్య‌మంత్రి కోరినా..ఆయ‌న అంగీక‌రించ‌లేదు. అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌న త‌రువాత ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో క‌లిసి వైసిపి లో చేరారు. ఆయ‌న వైసిపి నుండి ఒంగోలు ఎంపీగా పోటీ చేయ‌నున్నారు. మాగుంట త‌న లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని అసెంబ్లీ అభ్య‌ర్ధుల అంశం పైనా చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. రేప‌టి నుండే మాగుంట ప్ర‌చారం ప్రారంభించ‌నున్నారు.

జ‌గ‌న్ తో కొణ‌తాల భేటీ..ఎంపి సీటు పై పెండింగ్‌..

జ‌గ‌న్ తో కొణ‌తాల భేటీ..ఎంపి సీటు పై పెండింగ్‌..

మాజీ మంత్రి కొణ‌తాల రామ‌కృష్ణ లోట‌స్ పాండ్ లో జ‌గ‌న్ తో భేటీ అయ్యారు. ఆయ‌న తో వ‌చ్చిన అనుచ‌రులు వైసిపి లో చేరారు.అయితే, కొణ‌తాల ఉత్త‌రాంధ్ర స‌మ‌స్య‌ల పై తాను జ‌గ‌న్ తో చ‌ర్చించిన‌ట్లు వివ‌రించారు. తాను ఎంపీగా పోటీ చేయాల‌ని భావిస్తున్నాన‌ని..అన‌కాప‌ల్లి ఎంపీ సీటు హామీ ల‌భిస్తే తాను వైసిపి లో చేర‌టానికి సిద్దంగా ఉన్న‌ట్లు గా కొణ‌తాల చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అయితే, ఇప్ప‌టికే దాడి వీర‌భ‌ద్ర రావు త‌న కుమారుడు తో స‌హా వైసిపి లో చేరారు. వారు కూడా అన‌కాప‌ల్లి ఎంపి సీటు ఆశిస్తున్నారు. కొణతాల‌కు ఎంపి సీటు పై స్ప‌ష్ట‌మైన హామీ ల‌బించ‌లేద‌ని తెలుస్తోం ది. దీని పై పార్టీలో చ‌ర్చించి నిర్ణ‌యం చెబుతాన‌ని హామీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో..కొణ‌తాల అధికారికంగా పార్టీ లో చేర‌లేదు. కానీ, ఆయ‌న వైసిపి లో చేరుతార‌ని వైసిపి నేత‌లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+