వైసిపిలోనే ఉంటా: జగన్ 'ఆగ్రహం-అల్టిమేటం'పై బుట్టా రేణుక

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: తాను ఎట్టి పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వదిలే ప్రసక్తి లేదని ఎంపీ బుట్టా రేణుక స్పష్టం చేసారు. పార్లమెంటరీ భేటీలో పార్టీ అధినేత జగన్ తనపై ఆగ్రహం వ్యక్తం చేశారనే ప్రచారం అవాస్తవం అని అభిప్రాయపడ్డారు.

లోకేష్‌ను కలిసిన జగన్ పార్టీ ఎంపి బుట్టా రేణుక

తాను పార్టీ మారనని, తన గురించి జగన్ అన్నకు తెలుసునని, కాబట్టి అలాంటి అవకాశం లేదన్నారు. తాను పార్టీ మారుతానని మీడియాలో వార్తలు రావడం చాలా బాధాకరమన్నారు. అభివృద్ధి పనుల విషయంలోనే మంత్రి నారా లోకేష్‌ను కలిశానని చెప్పారు.

వైసిపిలో తనకు ప్రాధాన్యత ఇస్తున్నారని, అలాంటప్పుడు పార్టీ మారే అవకాశం ఎందుకు ఉంటుందన్నారు. పార్టీ పార్లమెంటరీ సమావేశానికి తాను రావడం లేదని మరో ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డికి తాను ముందే సమాచారం అందించానని చెప్పారు.

రేణుకపై జగన్ ఆగ్రహం అంటూ..

రేణుకపై జగన్ ఆగ్రహం అంటూ..

కాగా, బుట్టా రేణుక నారా లోకేష్‌ను కలవడం, అదే సమయంలో వైసిపి పార్లమెంటరీ భేటీకి హాజరు కాకపోవడంపై వైసిపి అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా పుకార్లు వినిపించాయి. ఆమెతో పాటు పలువురు ఎంపీలు కూడా హాజరు కాలేదు.

Chandrababu Fires On TDP Leaders Over YS Jagan Matter | Oneindia Telugu
నలుగురే హాజరు

నలుగురే హాజరు

పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఎంపీలతో జగన్ లోటస్ పాండులో సమావేశమయ్యారు. ఈ మేరకు అందరికీ సమాచారం పంపించారు. కానీ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలే హాజరయ్యారు.

రేణుక పార్టీలో ఉంటారా.. వెళ్తారా?

రేణుక పార్టీలో ఉంటారా.. వెళ్తారా?

బుట్టా రేణుక హాజరు కాకపోవడంపై జగన్ ఈ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం సాగింది. లోకేష్‌ను కలవడం వల్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని, ఆమె గతంలో సీఎం చంద్రబాబును కలిసేందుకు సచివాలయానికి వెళ్లారని జగన్ గుర్తు చేశారట. ఆమె పార్టీలో ఉండాలనుకుంటున్నారో లేదో తేల్చుకోమని చెప్పాలని ఎంపీలకు సూచించినట్లుగా ప్రచారం జరిగింది.

వీరు గైర్హాజరు

వీరు గైర్హాజరు

కాగా, తనకు వ్యక్తిగత పనులు ఉన్నాయని మిథున్ రెడ్డి, తనకు ప్లైట్ టైమ్ అవుతోందని వైవి సుబ్బారెడ్డిలు వెళ్లిపోయారు. బుట్టా రేణుక రాలేదు. విజయ సాయి రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, అవినాశ్ రెడ్డిలు మాత్రమే హాజరయ్యారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
MP Butta Renuka on Sunday said that she will not leave YSR congress party and she is no intention to join Telugu Desam. She said that she is very happy in YSR Congress party.
Please Wait while comments are loading...