ఆ నలుగురి పై అనర్హత వేటు - ఉప ఎన్నికల దిశగా..!?

క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని నలుగురు ఎమ్మెల్యేలను వైసీసీ సస్పెండ్ చేసింది. తరువాత చర్యల దిశగా అడుగులు వేస్తోంది. టీడీపీకి అనుకూలంగా ఓటు వేసిన ఆ నలుగురిపైన కఠినంగానే ఉండాలనేది వైసీపీ వ్యూహంగా స్పష్టం అవుతోంది. అందులో భాగంగా అనర్హత వేటు వేయాలంటూ ఫిర్యాదు చేసేందుకు వైసీపీ సిద్దం అవుతున్నట్లు సమాచారం.

ఇందుకు పెద్ద ఎత్తన కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీని పైన స్పీకర్ నిర్ణయం కీలకం కానుంది. అయితే, అనర్హత కోసం ఫిర్యాదు చేసినా..చర్యల వేళ అనేక సందేహాలు తెర మీదకు వస్తున్నాయి. వైసీపీ ఉప ఎన్నికలకు సిద్దం అవుతోందా అనేది అసలు ప్రశ్న.

అనర్హత వేటు దిశగా అడుగులు

వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉంటూ టీడీపీ అభ్యర్ధికి సహకరించిన నలుగురిపై వైసీపీ నాయకత్వం సీరియస్ గా ఉంది. సప్పెన్షన్ తో సరి పెట్టకూడదని భావిస్తున్నారు. ఇందు కోసం పార్టీలోని ముఖ్యులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నలుగురు పైన అనర్హత వేటుకు కోరేందుకు ఉన్న అవకాశాలు...ఆధారాల పైన ఫోకస్ చేసారు.

స్పీకర్ కు ఫిర్యాదు చేస్తే..ఇక సభాపతి దాని పైన నలుగురుకి నోటీసులు... వివరణ..చర్యలు ఉండే అవకాశం ఉంటుంది. అయితే, అసలు ఈ నలుగురి క్రాస్ ఓటింగ్ చేసారని బయటకు నిరూపించటం సాధ్యపడుతుందా అనే సందేహం వ్యక్తం అవుతోంది. వారి పైన సస్పెన్షన్ వేటు వేసే సమయంలోనూ సజ్జల ఇదే అంశం పైన ఆచి తూచి స్పందిస్తూ..సస్పెన్షన్ నిర్ణయాన్ని ప్రకటించారు.

Bypolls in AP:YSRCP in a plan to disqualify the four MLAs who defected,Speakers role crucial

ఉప ఎన్నికలు వస్తాయా..?

ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలపైన చర్యలకు సిద్దమైతే..అదే సమయంలో టీడీపీ నుంచి నలుగురు, జనసేన నుంచి ఒకరి విషయంలో ఏం చేస్తారనే ప్రశ్నలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు నలుగురు ఎమ్మెల్యేల విషయంలో చర్యల దిశగా టీడీపీ నుంచి డిమాండ్ లేదు. ఆ నలుగురి స్థానంలో వైసీపీ నుంచి నలుగురి మద్దతు లభించందనే జోష్ లో ఆ పార్టీ నేతలు ఉన్నారు.

అయితే, ఈ నలుగురి పైన వైసీపీ నుంచి ఫిర్యాదులు.. అనర్హతం అంశం పైన స్పీకర్ సానుకూల నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో ఉప ఎన్నికలకు దారి తీసే అవకాశం ఉందనే చర్చ అధికార పార్టీలో వినిపిస్తోంది. మరో సంవత్సర కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది.

వరుసగా మూడు గ్రాడ్యుయేట్ సీట్లు..ఎమ్మెల్సీ సీటు గెలిచిన టీడీపీ పెద్ద ఎత్తున మైండ్ గేమ్ ప్రారంభించింది. ఇక వైసీపీ పని అయిపోయిందని ప్రచారం చేస్తోంది. వైసీపీ గెలిచిన ఉపాధ్యాయ సీట్ల గురించి చర్చ జరగటం లేదు.

అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం అవుతున్న సమయంలో టీడీపీ చేస్తున్న ప్రచారం తిప్పి కొట్టే స్థాయిలో బలమైన నిర్ణయాలు లేకుంటే...ఇదే తరహా ప్రచారం కొనసాగే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది. దీంతో..ఇప్పుడు ఈ నలుగురి విషయంలో వైసీపీ తీసుకొనే చర్యలు..స్పీకర్ నిర్ణయం ఏంటనేది ఆసక్తిని పెంచుతోంది. ఇది మొత్తంగా ఉప ఎన్నికకు దారి తీస్తుందా.. లేక న్యాయపరమైన అంశంగా మారుతుందా అనేది చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+