రఘురామకు బంపర్ ఆఫర్-ప్రోటోకాల్ పెంచిన చంద్రబాబు..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా ఉంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న కనుమూరు రఘురామకృష్ణంరాజుకు కూటమి సర్కార్ లో అంతకంతా మర్యాదలు దక్కుతున్నాయి. గత ఎన్నగల సమయంలో టీడీపీలో చేరి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని, ఉండి నుంచి గెలిచిన రఘురామకృష్ణంరాజుకు తాజాగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా దక్కింది. అంతటితో ఆగకుండా ఆయనకు మరో ఆఫర్ ఇస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

cabinet rank to assembly deputy speaker raghurama Krishnam raju

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా గత బడ్జెట్ సమావేశాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన రఘురామకృష్ణంరాజుకు కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన్ను కేబినెట్ మంత్రి హోదాతో సమానంగా పరిగణించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు సీఎంవో రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సురేశ్ కుమార్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇకపై రఘురామను మంత్రులతో సమానంగా పరిగణించాల్సి ఉంటుంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ప్రకారం రఘురామరాజుకు ఇలా కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఉన్నంతకాలం ఈ కేబినెట్ మంత్రి హోదా వర్తిస్తుందని కూడా తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారిక ఉత్తర్వుల సవరణ కూడా అవసరం లేదని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు గత ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు పడిన రఘురామకు మంత్రి పదవి లేదా స్పీకర్ ఇస్తారని అంతా భావించారు. కానీ కూటమిలో పదవుల పంపకాల్లో ఆయనకు నిరాశ తప్పలేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు కేబినెట్ హోదా కూడా ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+