ఎన్టీఆర్‌ విగ్రహానికి హీరో కళ్యాణ్ రామ్ పాలాభిషేకం

హైదరాబాద్: పటాస్ సినిమా విజయవంతం కావడంతో విజయోత్సవ సభలు జరుపుకుంటున్న హీరో కళ్యాణ్ రామ్ శుక్రవారం హిందూపురంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలభిషేకం చేశారు. అనంతరం కళ్యామ్ రామ్ మాట్లాడుతూ నందమూరి అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

ఏపీకి ప్రత్యేక హోదాపై మంత్రి పల్లె రఘనాధ రెడ్డి

ఇతర రాష్ట్రాలతో ముడిపెట్టకుండా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ మంత్రి పల్లె రఘనాథ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాట పెట్టుకోకుండా సఖ్యతతో కేంద్రాన్ని ఒప్పించి విభజన హామీలను కేంద్రం నెరవేర్చాలని కోరతామన్నారు.

Cabinet sub committee meeting with cement factory owners

ఏపీ కేబినెట్‌ ఉపసంఘం సిమెంటు కంపెనీల యజమానులతో భేటి అయింది. సిమెంటు కంపెనీల యజమానులు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారని, నాలుగైదు రోజుల్లో సిమెంటు ధరలను తగ్గించకపోతే కంపెనీలపై చర్యలు తప్పవని పల్లె హెచ్చరించారు.

హైదరాబాద్‌లో సిమెంట్ కంపెనీ పారిశ్రామికవేత్తలో ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంలో పల్లె మాట్లాడుతూ పాత రేట్ల ప్రకారమే సిమెంట్ బస్తాలను విక్రయించాలన్నారు. ముడి సరకులు ధరలు తగ్గుతున్నప్పటికీ సిమెంటు కంపెనీల యజమానులు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారని, 4, 5 రోజుల్లో పెంచిన ధరలు తగ్గించాలి.. లేకుంటే చర్యలు తప్పవని పారిశ్రామికవేత్తలకు పల్లె రఘునాథ్ రెడ్డి సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+