ముందే లీవ్ పెట్టా: సీపీ సవాంగ్ వివరణ, 'కాల్ మనీ'కి బౌన్సర్లు, దురాగతాలివే...
విజయవాడ: కాల్ మనీ వ్యవహారంలో పోలీసులపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ మంగళవారం అన్నారు. కాల్ మనీ వ్యవహారంలో ప్రజాప్రతినిధుల ప్రమేయమున్నట్లు ఇప్పటి దాకా తమ దృష్టికి రాలేదన్నారు. కాల్ మనీ వ్యవహారం ఎప్పటి నుంచో ఇక్కడ ఉందన్నారు.
రెండు నెలల క్రితమే తాను సెలవులకు దరఖాస్తు చేసుకున్నానని వివరణ ఇచ్చారు. ఈ నెల 27న తిరిగి విధులకు హాజరవుతానన్నారు.
అయితే, విజయవాడకు ఇంఛార్జిగా వస్తున్న పోలీస్ కమిషనర్ మరింత సమర్థుడన్నారు. ఆయనకు విజయవాడ సీపీగా పని చేసిన అనుభవముందన్నారు. తన సెలవుల పైన విమర్శలు రావడంపై ఆయన వివరణ ఇచ్చారు.

నలభై కాల్ మనీ గ్యాంగులకు బౌన్సర్లు
విజయవాడలో నలభై కాల్ మనీ గ్యాంగ్‌లు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ గ్యాంగ్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా గుర్తించారు. ప్రతి కాల్ మనీ గ్యాంగ్‌లో బౌన్సర్లతో పాటు ఇరవై మంది దాకా సభ్యులున్నారు. డబ్బులివ్వని వారిని బౌన్సర్లు ఎత్తుకొచ్చి ఆస్తులు రాయించుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
వెలుగు చూసిన నలభై గ్యాంగ్‌ల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం ఒక్కరోజే పది మంది గ్యాంగ్‌ల్లోని 57 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్ మనీ గ్యాంగ్‌ల సూత్రధారుల్లో అన్ని పార్టీల నేతల అనుచరులు ఉన్నారని, కొన్ని ప్రాంతాలను పంచుకుని ఈ వ్యాపారం చేస్తున్నారని గుర్తించారు.
కాల్ మనీ దురాగతాల పైన వైసిపి అధినేత జగన్... గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆయన తన వినతి పత్రంలో కాల్ మనీ గ్యాంగ్ దురాగతాలను వివరించారు. డబ్బు అవసరమున్న మహిళళకు అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి వారిని ఎలా సెక్స్ రాకెట్లోకి లాగింది, దోచుకుందీ జగన్ వివరించారు.
తన కుమార్తె ఉన్నత చదువుల కోసం కాల్ మనీని సంప్రదించిన ఓ మహిళను, కుమార్తెను వ్యభిచారంలోకి లాగాలని చూడటంతో ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో రాకెట్ బద్దలైందని వివరించారు. సెవెన్ సిస్టర్స్ ఏజెన్సీ నడుపుతున్న ఓ ప్రయివేటు ఫైనాన్షియర్... రూ.3 లక్షల రుణాన్ని తీర్చలేదని తన కుమార్తె, అల్లుడిని అపహరించుకో వెళ్లిన ఉదంతంపై మరో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ రుణంపై 30 శాతం వడ్డీ తీసుకున్నారు. ఈ గ్యాంగ్ అమాయకులైన మహిళలకు రుణాలను అత్యధిక వడ్డీలకు ఇచ్చి, వారు చెల్లించకుంటే వారి ఇళ్లను, పొలాలను బలవంతంగా బదలాయించుకుంటారు. కొన్ని ఉదంతాల్లో మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపడమే కాకుండా, వీడియోలను తీసి ఎప్పటికీవారు అదే ఊబిలో ఉండేలా చేస్తారు. మహిళలపై తీసిన వీడియోలు ఎన్నో ఉన్నాయి.
కాల్ మనీ వ్యవహారంలో ఉన్న గ్యాంగ్ ఆర్థిక సహకారంతోనే అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు విదేశీ విహారాలకు వెళ్లారని వెల్లడైందని ఆరోపించారు. వడ్డీ వ్యాపారం సెక్స్ రాకెట్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన వారు తప్పు చేసిన ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
-
GAS కష్టాలు.. భోజనం దొరకడం కూడా కష్టమేనా? -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications