ఆడాళ్ల ప్రాణమానాలతో చెలగాటం: జిల్లాల్లోనూ కాల్ మనీ భూతం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన నగరం విజయవాడలో వెలుగు చూసిన దిగ్భ్రాంతికరమైన కాల్ మనీ భూతం జిల్లాల్లోనూ విస్తరించినట్లు అర్థమవుతోంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదవారి, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లోనే కాకుండా రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో కూడా విస్తరించి ఉన్నట్లు తెలుస్తోంది.

కాల్ మనీ గ్యాంగ్‌లు వడ్డీకి డబ్బులు తీసుకున్న వ్యక్తులనే కాకుండా వారి ఆడవాళ్ల ప్రాణమానాలతో చెలగాటమాడిన వైనాలు బయటపడి ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. దాదాపు 600 కోట్ల టర్నోవర్‌తో విజయవాడలో విస్తరించిందని భావించిన కాల్ మనీ ముఠాల కార్యకలాపాలు ఇతర జిల్లాల్లో వెలుగు చూస్తున్నాయి.

కాల్ మనీ వ్యవహారంలో రాజకీయ నేతల ప్రమేయం కూడా క్రమంగా బయటపడుతోంది. అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్రనే కాకుండా ఇతర పార్టీల నాయకుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది ఎక్కువగా అధికార తెలుగుదేశం పార్టీ మెడకే చుట్టుకుంది.

ఇటీవల తీవ్ర సంచలనం సృష్టించిన కృపామణి ఆత్మహత్యకు కూడా కాల్ మనీ గ్యాంగ్ ముఠా హస్తమే కారణమని భావిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఈ సంఘటన చోటు చేసుకుంది. తన భార్యను, పిల్లలను అప్పగించాలని కాల్ మనీ గ్యాంగ్ బెదిరిస్తూ ఒత్తిడి చేయడంతో పాల వ్యాపారి నాగ గణేష్ పరువు పొతుందని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

Call Money scam surfacing in AP districts

తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురంలో పోలీసులు వడ్డీ వ్యాపారుల ఇళ్లలో, దుకాణాల్లో సోదాలు చేసి కోట్లాది విలువ చేసే ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అమలాపురంలో ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

రాంబాబు అనే వడ్డీవ్యాపారిపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఐదు లక్షల రూపాయలు ఇస్తే తాను 13 లక్షల రూపాయలు చెల్లించానని, అయినా వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటి డాక్యుమెంట్లు తీసుకున్నాడని ఆ మహిళ నాగమణి ఆరోపించింది.

కాల్ మనీకి సంబంధించి తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోనూ ఓ కేసు నమోదైంది. వడ్డీ వ్యాపారి తమను వేధిస్తున్నాడంటూ ముగ్గురు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విశాఖపట్నంలోనూ ఇటువంటి సంఘటన వెలుగు చూసింది. విశాఖనగరంలోని అరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో కాలమ్ దందాపై కేసు నమోదైంది. రామకృష్ణ అనే ఫైనాన్షియర్‌పై మంగళవారంనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇతనిపై గతంలో కూడా నగరంలోని నాలుగవ టౌన్‌లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

కాల్ మనీ వ్యవహారంపై కాంగ్రెసు పార్టీ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాుద చేసింది. దీంతో రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఎన్‌హెచ్ఆర్సీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావుకు, డిజిపి జెవి రాముడికి నోటీసులు జారీ చేసింది.

పోలీసులు వరుసగా దాడులు చేస్తుండడంతో కాల్ మనీ వ్యాపారులు జాగ్రత్త పడుతున్నారు. సాక్ష్యాలను మాయం చేసే పనికి పూనుకుంటున్నారు. మహిళలను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపడం, బ్లూ ఫిల్స్ తీసి విక్రయించడం వంటి చర్యలకు కాల్ మనీ ముఠాలు పూనుకున్నాయి. తమ వద్ద ఉన్న బ్లూ ఫిలింలను, రాయించుకున్న ప్రామిసరీ నోట్లను కాలువలో పడేసిన సంఘటన కూడా చోటు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+