ఢిల్లీ చేరిన రాజధాని అమరావతి ఆందోళన .. గాంధీ జయంతినాడు రాజ్ ఘాట్ వద్ద మౌన ప్రదర్శన
రాజధానిగా అమరావతి కొనసాగాలని ఉద్యమం ఇంకా సాగుతూనే ఉంది. మొదట్లో రాజధాని అమరావతి ఉద్యమం ఉధృతంగా సాగినా, మధ్యలో కరోనావైరస్ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ప్రచారానికి దూరమైంది. కానీ నేటికీ అమరావతి రైతులు ఏదో ఒక రూపంలో తమ ఆందోళనలు తెలియజేస్తూనే ఉన్నారు రాజధాని ప్రాంత రైతులు . రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి జెఏసి నేతలు దీక్షలు చేస్తున్నారు.
రాజధాని రైతుల పోరాటాన్ని ఇప్పటికే పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళిన రాజధాని ప్రాంత రైతులు ఇన్ని రోజుల తర్వాత కూడా కేంద్రం రాజధాని అమరావతి విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు . తమ పోరాటంలో భాగంగా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జేఏసీ నేతలు ఢిల్లీ వెళ్లారు. నేడు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీ వెళ్లిన జేఏసీ నేతలు రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ మౌన ప్రదర్శన చేపట్టారు.

రైతుల త్యాగాలతో ఏర్పడిన అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వారు విజ్ఞప్తి చేశారు .అమరావతి జేఏసీతో పాటు అమరావతి ప్రాంత రైతులు , తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ మహాత్ముడికి నివాళులు అర్పించారు. అమరావతి ఏపీ రాజధానిగా కొనసాగించాలని శాంతియుత మౌన ప్రదర్శన ద్వారా ప్రధానమంత్రికి తెలిసేలా నిరసన చేస్తున్నామని జేఏసీ నేతలు పేర్కొన్నారు. రాజధాని కోసం 290 రోజులుగా గాంధేయ మార్గంలో నిరసన కొనసాగిస్తున్నామని వారు పేర్కొన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించేలా పాలకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని మహాత్ముని వేడుకున్నట్లుగా జేఏసీ నేతలు చెప్తున్నారు.
Recommended Video
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications