ఏపీ మధ్యలో రాజధాని: నారాయణ, జగన్‌పై యనమల

విశాఖపట్నం/హైదరాబాద్: రాష్ట్రంలో మధ్యన రాజధాని ఉంటుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి పీ నారాయణ సోమవారం విశాఖలో అన్నారు. శాఖల మధ్య సమన్వయానికి కొత్త సాఫ్టువేర్ తీసుకు వస్తామన్నారు. మున్సిపల్ చైర్మన్లకు, కార్పోరేటర్లకు ఆగస్టులో శిక్షణ ఉంటుందన్నారు. 15 రోజులకు ఒకసారి మున్సిపాలిటీల్లో సమీక్షలు నిర్వహిస్తామన్నారు.

జగన్ పార్టీది విడ్డూరం: యనమల

రుణమాఫీ విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిరసనలు విడ్డూరమని ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు వేరుగా అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అన్నింటిని తాము అమలు చేస్తామని చెప్పారు. యువతను వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తామన్నారు.

Capital should middle of AP: Narayana

నీటిపారుదల శాఖ అధికారులతో చంద్రబాబు సమీక్ష

నీటి పారుదల శాఖ అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ఉదయం లేక్‌వ్యూలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు నీటి పారుదల రంగంపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.

వచ్చే ఐదేళ్లలో నీటి పారుదల శాఖపై ప్రభుత్వం ఏవిధంగా దృష్టి పెట్టనుందనే దానిపై శ్వేతపత్రం ద్వారా బాబు వివరించే అవకాశం ఉంది. మొత్తం ఆరు రంగాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా ఇప్పటికే నాలుగు రంగాలపై శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సాయంత్రం 4 గంటలకు ఇసుక పాలసీపై అధికారులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. మరోవైపు, మంత్రి కామినేని శ్రీనివాస రావు వైద్య శాఖ అధికారులతోసమీక్ష నిర్వహించారు.

శ్రీవారిని దర్శించుకున్న కేఈ

ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం కేఈ మాట్లాడుతూ.. రుణమాఫీ ప్రకటనతో రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. తిరుపతిని శాటిలైట్ సిటీ, ఐటీ హబ్‌గా మార్చుతామన్నారు. అందుబాటులో ఉండే ప్రాంతాన్నే రాజధానిగా ఎంపిక చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+