మహిళా సదస్సులో వరాలు: రోజా-జగన్‌కు గట్టి షాకిచ్చిన పోలీసులు, ఇదీ అసలు విషయం!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కర్నూలు జిల్లా బనగానపల్లెలో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని తెలుస్తోంది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కర్నూలు జిల్లా బనగానపల్లెలో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని తెలుస్తోంది. అనుమతి లేకుండా సభను నిర్వహించారని చెబుతూ ఈ కేసు నమోదు చేశారని తెలుస్తోంది. అయితే పోలీసులు ధ్రవీకరించాల్సి ఉందని అంటున్నారు.

చదవండి: అప్పుడే ఓట్లు అడుగుతా: జగన్ పెద్ద హామీ, అళ్లగడ్డలో అలా ముగిసింది, పావురాన్ని గిఫ్ట్‌గా ఇస్తే

జగన్, రోజా, కాటసానిలపై కేసు

జగన్, రోజా, కాటసానిలపై కేసు

సోమవారం బనగానపల్లె హుసేనాపురంలో వైయస్ జగన్ మహిళా సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు అనుమతి లేదని పోలీసులు ఈ కేసు నమోదు చేశారని సమాచారం. జగన్‌తో పాటు ఆ పార్టీ నాయకులు, నగరి ఎమ్మెల్యే రోజా, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలపై కూడా కేసు నమోదు చేశారని తెలుస్తోంది.

అనుమతి ఇచ్చారు కానీ, ఇదీ వైసిపి వాదన

అనుమతి ఇచ్చారు కానీ, ఇదీ వైసిపి వాదన

దీనిపై వైసిపి నేతల వాదన మరోలా ఉంది. హుసేనాపురంలో జగన్ మహిళా సదస్సుకు తాము అనుమతి తీసుకున్నామని, ఇందుకోసం 15వ తేదీన పోలీసులు అనుమతి ఇచ్చారని చెబుతున్నారు. అయితే ఆ తర్వాత 16వ తేదీన ఉద్దేశ్యపూర్వకంగా అనుమతిని నిరాకరించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సదస్సు జరిగింది.

మహిళా సదస్సులో వరాల జల్లు

మహిళా సదస్సులో వరాల జల్లు

కాగా, జగన్ మహిళా సదస్సుకు పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. వారు వస్తుండగా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని, అయినా వచ్చారని అంటున్నారు. ఇదిలా ఉండగా మహిళా సదస్సులో జగన్ వరాల జల్లు కురిపించారు.

చంద్రబాబే చెబుతున్నారు

చంద్రబాబే చెబుతున్నారు

ఎన్నికలు అక్టోబర్‌లో వస్తాయని చంద్రబాబే చెబుతున్నారని, ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మార్పు వస్తుందని జగన్ అన్నారు.
మేనిఫెస్టోలో పెట్టిన అంశాలపై టీడీపీ వెనకడుగు వేసిందని, తమ మేనిఫెస్టోను సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు, మహిళలు గర్వంగా బతికేలా రూపొందిస్తామన్నారు.

జగన్ వరాల జల్లు

జగన్ వరాల జల్లు

అమ్మ ఒడి స్కీమ్ కింద ప్రతి తల్లి బ్యాంక్ అకౌంట్ లోకి రూ. 15వేలు నేరుగా వెళ్లేలా చేస్తామని, దీంతో ఇద్దరు పిల్లలను స్కూల్లో చదివించవచ్చని జగన్ తెలిపారు. ప్రొఫెషనల్ కోర్సులు చదివేవారికి ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తామని, దీనికి తోడు హాస్టల్ ఖర్చుల కోసం రూ. 20వేలు ఇస్తామన్నారు. పెన్షన్ ను రూ. 2వేలకు పెంచుతామని, వెనకబడిన తరగతులు, మైనార్టీల వయసు పరిమితిని 45 ఏళ్లకు తగ్గిస్తామన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ కార్యదర్శులను నియమిస్తామని, ప్రతి ఒక్కరికీ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+