మాజీ మంత్రి పెద్దిరెడ్డికి బిగ్ షాక్
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలం లోని మంగళం పేటలో ఉన్న అటవీ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి 27.98 ఎకరాలను కబ్జా చేశారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే ఆరోపణలపై పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపైనా అటవీశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. అటవీ శాఖ అధికారులు ఈ నెల 6న కేసు నమోదు చేశారు.
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామంలో ఉన్న అటవీ భూమిలోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా స్థలాన్ని ఆక్రమించి, జీవ వైవిధ్యానికి నష్టం కలిగించినట్లు ప్రాథమిక నేర నివేదికలో అధికారులు తెలిపారు.

ప్రభుత్వ అటవీ భూమిలో 27.98 ఎకరాలను పెద్ది రెడ్డి, అతని కుటుంబ సభ్యులు కబ్జా చేసినట్లు తేలిందని అన్నారు. నిందితులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడి భార్య ఇందిరమ్మ కూడా ఉన్నట్లు అధికారులు అన్నారు.
మరోవైపు ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం దీనిపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications