'సాక్షిలో అసత్య ప్రచారం': జగన్, భార్య భారతిలపై కేసు
విజయవాడ/గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన గుంటూరు జిల్లా పొన్నూరు గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదయింది. ఈ విషయాన్ని ఎస్సై తెలిపారు.
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో 50 ఎకరాల వాగు పోరంబోకు భూమిని ఆక్రమించుకున్నారని గత నెల మూడో తేదీన సాక్షి మీడియాలో ప్రచారం జరిగిందని, తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లే విధంగా చేశారని వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ గత నెల ఆరో తేదీన ఎమ్మెల్యే ధూళిపాళ్ల లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి జగన్, సాక్షి దినపత్రిక ప్రింటర్, పబ్లిషర్ కె రామచంద్రమూర్తి, ఎడిటర్ వి మురళీ, జగతి పబ్లికేషన్స్ ఛైర్మన్ వైయస్ భారతీ రెడ్డి, జగతి పబ్లికేషన్స్ డైరెక్టర్లు, ఇందిరా టెలివిజన్ డైరెక్టర్లు, తదితరులపై 500, 501, రెడ్ విత్ 34 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆదివారం తెలిపారు.
జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు
వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కతని ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జున రెడ్డి కడప జిల్లాలో మండిపడ్డారు. రాజంపేటలో ప్రభుత్వ బీసీ హాస్టల్లో కేంద్ర విద్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications