వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో క్యాసినో రగడ: గోవాలా గుడివాడ; మంత్రి కొడాలి నానీని మెచ్చుకున్నఆర్జీవీ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాసినో సంస్కృతి పై చర్చ కొనసాగుతుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సంక్రాంతి సంబరాల సందర్భంగా గుడివాడలో క్యాసినో నిర్వహించారని, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టిస్తున్నారని వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు వెల్లువగా మారాయి. తాజాగా ఈ వ్యవహారం పై స్పందించిన రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్లు క్యాసినో వ్యవహారంపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

గుడివాడలో క్యాసినో రగడ ... కొడాలి నానీపై ఆరోపణలు

గుడివాడలో క్యాసినో రగడ ... కొడాలి నానీపై ఆరోపణలు

సంక్రాంతి పండుగ సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో ఓ ఫంక్షన్ హాల్ లో కోడిపందాలు, పేకాట శిబిరాలు, గుండాటతో పాటుగా ప్రత్యేకంగా క్యాసినో నిర్వహించారు. పదివేల రూపాయలు చెల్లిస్తేనే క్యాసినో లోకి అనుమతించారు నిర్వాహకులు. ప్రత్యేకంగా బౌన్సర్ లను కూడా ఏర్పాటు చేసుకొని ఈ ఫంక్షన్ హాల్ లో సంక్రాంతి సందర్భంగా చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు నిర్వహించారని టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు.

బెట్టింగ్, గ్యాంబ్లింగ్ తో పాటుగా అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు వంటి చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు మంత్రి కొడాలి నాని సహకారం ఉందని టిడిపి నేతలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని టిడిపి నేతలు ఆరోపణలు గుప్పించారు. క్యాసినో నిర్వహించిన ఫంక్షన్ హాల్ రాష్ట్రమంత్రికి చెందిందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

గుడివాడ క్యాసినో వ్యవహారంపై రాం గోపాల్ వర్మ ట్వీట్లు

గుడివాడ క్యాసినో వ్యవహారంపై రాం గోపాల్ వర్మ ట్వీట్లు

గత రెండు రోజులుగా టిడిపి నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో గుడివాడలో జరిగిన క్యాసినో కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని ని టార్గెట్ చేస్తూ టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు పలువురు ముఖ్య నేతలు, మరోవైపు ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తో సహా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా గుడివాడలో క్యాసినో వ్యవహారంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా కొడాలి నానీకి పొగడ్తల వర్షం కురిపించాడు.

గుడివాడ ఆధునికీకరణకు శ్రీకారం చుట్టిన కొడాలి నానికి తన మద్దతు అన్న వర్మ

గుడివాడ ఆధునికీకరణకు శ్రీకారం చుట్టిన కొడాలి నానికి తాను పూర్తిగా మద్దతు తెలుపుతున్నానని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. క్యాసినో కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళంతా పూర్వీకులని, వారికి ఏమీ తెలియదని రాంగోపాల్ వర్మ సెటైర్లు వేశారు. వారంతా చరిత్రపూర్వ చీకటి యుగాలకు ప్రగతిని లాగుతున్న వారని రాం గోపాల్ వర్మ పేర్కొన్నారు. అంతేకాదు గుడివాడలో క్యాసినో నిర్వహించడాన్ని చిన్నచూపు చూస్తున్న వారంతా గోవా, లాస్ వెగాస్ లాంటి మెగా నగరాలను తక్కువ చేయడమేనని వర్మ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

లండన్, లాస్ వెగాస్, ప్యారిస్ నగరాల్లా గుడివాడ అభివృద్ధి

గుడివాడను కొడాలి నాని లండన్, లాస్ వెగాస్, ప్యారిస్ లాంటి నగరాల తరహాలో కొడాలి నాని అభివృద్ధి చేస్తున్నారంటూ, ఆ స్థాయిలో గుడివాడను మారుస్తున్నారని వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. క్యాసినోపై ఆరోపిస్తున్న వాళ్ళు గుడివాడకు గోవా సంస్కృతిని తీసుకొచ్చినందుకు కొడాలి నానీని మెచ్చుకోవాలన్నారు. ఎందుకంటే గుడివాడ ప్రజలు గోవాకు వెళ్తారని గుర్తించాలి కానీ గోవా ప్రజలు గుడివాడకు రారు అని, గుడివాడను ఆధునీకరించే ప్రయత్నం చేసినందుకు కొడాలి నాని గారిని మెచ్చుకోవాలి అంటూ వర్మ తనదైన శైలిలో స్పందించారు.

జై గుడివాడ అంటూ క్యాప్షన్ పెట్టి మరీ క్యాసినోకు వర్మ సపోర్ట్

జై గుడివాడ అంటూ క్యాప్షన్ పెట్టి మరీ క్యాసినోకు వర్మ సపోర్ట్

క్యాసినో కారణంగా గోవా ప్రజలు గుడివాడ వచ్చేలా కొడాలి నాని ఆధునికరిస్తున్నారంటూ వర్మ పేర్కొన్నారు. జై గుడివాడ అంటూ క్యాప్షన్ పెట్టి మరీ ట్వీట్ చేసిన వర్మ గుడివాడ క్యాసినో పై ఆసక్తికరమైన ట్వీట్స్ చేశారు. ఒకపక్క రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరూ ఏపీలో క్యాసినో కల్చర్ పై నిప్పులు చేరుగుతుంటే రాం గోపాల్ వర్మ మాత్రం అందులో తప్పేమీ లేదన్నట్టు పేర్కొన్నారు. కొడాలి నానీని మెచ్చుకోవాలన్నారు.

English summary
Criticisms have been pouring in, targeting Minister Kodali Nani for casino culture in Gudivada during the Sankranti celebrations. Responding to this, Ram Gopal Varma praised Kodali Nani for converting Gudivada to the level of Goa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X