వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే శ్రీదేవిపై కుల వివక్ష .. నలుగురు టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసు..చంద్రబాబుపై ఎమ్మెల్యే ఫైర్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయక చవితి పండుగ రోజున వినాయకుడి సాక్షిగా ఓ దళిత ఎమ్మెల్యేకు జరిగిన అవమానం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది . వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో కొందరు టిడిపి నేతలు దూషించటం,ఎమ్మెల్యే శ్రీదేవి కంటతడి పెట్టటం తెలిసిందే.

తనను అవమానించిన వారిపై న్యాయపోరాటానికి సిద్ధం అయిన శ్రీదేవి పోలీసులకు తనను అవమానించిన సదరు టీడీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

కులం పేరుతో అవమానించారని వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు .. నలుగురిపై కేసు నమోదు

కులం పేరుతో అవమానించారని వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు .. నలుగురిపై కేసు నమోదు

గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని స్థానిక టీడీపీ నేతలు అవమానకర వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురి చేశారు . తన నియోజకవర్గంలోని తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో వినాయక మండపం వద్ద పూజలో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీదేవి దళిత మహిళ కాబట్టి పూజలు చేయడాన్ని వ్యతిరేకించారు. శ్రీదేవి గణేష్‌ చతుర్థి వేడుకల్లో పాల్గొంటే వినాయకుడు మైలపడతాడు అంటూ ఆమెను కులం పేరుతో దూషించి హేళన చేశారు.దీంతో మనస్తాపానికి లోనైన ఎమ్మెల్యే కంటతడి పెట్టారు. ఇక దీనిపై ఆమె కులంపేరుతో తనను దూషించారని చేసిన ఫిర్యాదుతో అట్రాసిటీ కేసులు నమోదు చేశారు పోలీసులు .

ఆమె పూజ చేస్తే వినాయకుడు మైల పడతాడని వైసీపీ దళిత ఎమ్మెల్యే పై హేళన .. కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యేఆమె పూజ చేస్తే వినాయకుడు మైల పడతాడని వైసీపీ దళిత ఎమ్మెల్యే పై హేళన .. కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే

గణేష్ చతుర్ధి రోజు దళిత ఎమ్మెల్యే పూజ చేస్తే దేవుడు మైల పడతాడని వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు

గణేష్ చతుర్ధి రోజు దళిత ఎమ్మెల్యే పూజ చేస్తే దేవుడు మైల పడతాడని వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు

నలుగురిపై అట్రాసిటీ కేసులు నమోదు కాగా ఏ1గా కొమ్మినేని శివయ్య. ఏ2గా కొమ్మినేని సాయి, ఏ3గా కొమ్మినేని రామకృష్ణ, ఏ4గా కొమ్మినేని బుజ్జి పేర్లను పేర్కొన్నారు పోలీసులు. వినాయకచవితి ఉత్సవాలకు వెళ్లిన తనను టీడీపీ నేతలు కులం పేరుతో దూషించారని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. విషయం తెలిసిన కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపారు. ఈ మేరకు ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వినాయక మండపంలో దళితులు పూజ చేస్తే దేవుడికి మైల అంటుతుందని టీడీపీకి చెందిన వారు దూషించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ళితులను టీడీపీ చులకనగా చూస్తుందన్న శ్రీదేవి .. చంద్రబాబుపై కూడా కేసు పెట్టాలని మండిపాటు

ళితులను టీడీపీ చులకనగా చూస్తుందన్న శ్రీదేవి .. చంద్రబాబుపై కూడా కేసు పెట్టాలని మండిపాటు

ఇక ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీదేవి దళితులను టీడీపీ చులకన చూస్తోందని ఆరోపించారు. అవకాశం దొరికినప్పుడల్లా టీడీపీ నేతలు తనను అవమానపరుస్తున్నారని ఆమె గుర్తు చేశారు.
మంగళవారం నాడు అమరావతిలో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ అనంతవరంలో టీడీపీ నేతలు తనను కులం పేరుతో దూషించారని, అవమానించారని ఆవేదన చెందారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ ను ప్రభుత్వ కార్యక్రమాల్లో తన పక్కన ఎన్నిసార్లు కూర్చోపెట్టుకొన్నారని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో దళితులకు న్యాయం జరగలేదన్న ఎమ్మెల్యే శ్రీదేవి అందుకే దళితులు వైఎస్ఆర్‌సీపీ వైపు మొగ్గు చూపారని పేర్కొన్నారు .

కుల వివక్ష కేసులో తనకు న్యాయం చేయాలని డీజీపీని, ఎస్పీని కోరిన ఎమ్మెల్యే శ్రీదేవి

కుల వివక్ష కేసులో తనకు న్యాయం చేయాలని డీజీపీని, ఎస్పీని కోరిన ఎమ్మెల్యే శ్రీదేవి

దళితులను అణగదొక్కేందుకు టీడీపీ ప్రయత్నం చేసిందన్నారు. రాజధాని గ్రామాల్లో టీడీపీ నేతలు రౌడీల మాదిరిగా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.తనపై ఇప్పటికే మూడు దఫాలు ఇదే రకంగా వ్యవహరించారని ఎమ్మెల్యే శ్రీదేవి గుర్తు చేశారు. తనను కులం పేరుతో దూషించిన కేసులో ఇప్పటికే ఒకరు అరెస్టయ్యారని, మరో ముగ్గురు తప్పించుకొని తిరుగుతున్నారని ఆమె చెప్పారు. ఈ కేసు విషయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ డీజీపీ, ఎస్పీని కలిసినట్టుగా శ్రీదేవి తెలిపారు.

English summary
There are some TDP leaders who have slandered YSP MLASridevi in ​​the name of caste. According to the YCP MLA's complaint, four persons were lodged with Atrocity cases . The incident of her tears that the TDP leaders had slandered her during her visit to the Vinayakachavati festivities became a matter of local discussion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X