వైఎస్ అవినాష్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించిన సీబీఐ- వాట్సాప్ కాల్స్ పైనే ?
ఏపీలో సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నిందితుల్ని అరెస్టు చేసి జైలుకు పంపిన సీబీఐ.. అక్కడే కస్టడీ విచారణ కూడా చేస్తోంది. అలాగే మరికొందరు అనుమానితుల్ని, నిందితుల్ని లోతుగా విచారిస్తోంది. ఇదే క్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఇవాళ మరోసారి ప్రశ్నించింది.
తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు తర్వాత తొలిసారి వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ ఇవాళ హైదరాబాద్ లో విచారించింది. ఇప్పటివరకూ సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు తల్లి అనారోగ్యాన్ని కారణంగా చూపిన అవినాష్.. ఇవాళ మాత్రం విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఇందులో వివేకా హత్య జరిగిన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపైనే ప్రశ్నించినట్లు సమాచారం.

వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు రాత్రి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పలువురితో వాట్సాప్ కాల్స్ మాట్లాడినట్లు సీబీఐ అనుమానిస్తోంది. ఇదే విషయాన్ని తెలంగాణ హైకోర్టుకు కూడా తెలిపింది. కానీ వాటి డేటాను వెలికితీసే అవకాశం లేదు. దీంతో సదరు వాట్సాప్ కాల్స్ ఎవరితో మాట్లాడారన్న దానిపై ఇవాళ అవినాష్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే సీబీఐ దర్యాప్తులో అవే కీలకంగా మారిపోయాయి.
వివేకా హత్య జరిగిన సమయంలో వాట్సాప్ కాల్స్ లో మాట్లాడుతూ అవినాష్ రెడ్డి యాక్టివ్ గా ఉన్నారని ఆరోపిస్తున్న సీబీఐ.. సాంకేతికంగా సేకరించిన ఆధారాలతో ఈ విషయాన్ని నిర్ధారించుకుంది. అయితే ఆయన ఎవరితో మాట్లాడారన్న దాన్ని మాత్రం కనిపెట్టలేకపోయింది. దీంతో ఆ డేటా దొరికితే తప్ప సీబీఐ ఈ వ్యవహారంలో ముందుకెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. తెలంగాణ హైకోర్టు అవినాష్ కు బెయిల్ మంజూరు చేయడం వెనుక కూడా ఇదే అంశం కీలకంగా మారింది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications