మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్..!!
నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఫైళ్ల మిస్సింగ్ కేసులో కాకాణి పాత్ర లేదంటూ ఛార్జ్ షీట్‌లో సీబీఐ స్పష్టం చేసింది. మంత్రి కాకాణికి నేరం జరిగిన విధానం పట్ల అవగాహన లేదని చార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొంది. దీని పైన మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పందించారు. చంద్రబాబుకు ఆయన సవాల్ విసిరారు.
ఎన్నికల వేళ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సీబీఐ రిలీఫ్ దక్కింది. నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో కాకాణి పాత్ర లేదంటూ ఛార్జ్ షీట్‌లో సీబీఐ స్పష్టం చేసింది. ఏడాది పాటు విచారణ జరిపి, 403 పేజీల చార్ఝ్ షీట్ దాఖలు సీబీఐ.. 88 మంది సాక్షులను విచారించింది. సొమిరెడ్డి ఆరోపణలను కొట్టిపారేసిన సీబీఐ.. మంత్రి కాకాణికి దోషులతో ఎలాంటి సంబంధం లేదని తేల్చింది. ఏపీ పోలీసుల విచారణను సీబీఐ సమర్థించింది. పోలీసులు నిర్ధారించిన సయ్యద్ హయత్, షేక్ ఖాజా రసూల్‌లను సీబీఐ దోషులుగా నిర్ధారించింది. దొంగతనాలు అలవాటున్న వీరే కోర్టులో ఉన్న బ్యాగ్ దొంగిలించారని చార్జ్ షీట్‌లో స్పష్టం చేసింది. ఈ కేసును హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేసిది.

సీబీఐ విచారణ జరపాలని హైకోర్టును మంత్రి కోరారు. సీబీఐ విచారణకు అభ్యంతరం లేదని అప్పట్లోనే హైకోర్టుకి అడ్వకేట్ జనరల్ తెలిపారు. సీబీఐ ఛార్జ్‌షీట్‌తో చంద్రబాబు, లోకేష్, సోమిరెడ్డిలకు షాక్ తగిలింది. రెండేళ్లుగా చేసిన ఆరోపణలన్నీ సీబీఐ ఛార్జ్‌షీట్‌తో పటాపంచలయ్యాయి. కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో తనకు క్లీన్‌చిట్ రావడంపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పందించారు. చంద్రబాబుకు సవాల్ విసిరారు. తనపై వచ్చిన ఆరోపణలకు సీబీఐ విచారణ కోరానని.. చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలకు విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ముంటే సీబీఐ విచారణ కోరగలరా అని సవాల్ చేసారు. చంద్రబాబు అవీనీతి పరుడు కాకుంటే సీబీఐ విచారణ కోరాలని కాకాణి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications