వివేకా లేఖ సంగతి తేల్చేందుకు కీలక పరీక్ష-సీబీఐ కోర్టు అనుమతి..
ఏపీలో తీవ్ర సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు మరోసారి ఊపందుకుంటోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితుల్ని అరెస్టు చేసి జైలుకు పంపిన సీబీఐ.. కీలక ఆధారాల విషయంలో మాత్రం తడబడుతోంది. ముఖ్యంగా వివేకా రాశారని చెబుతున్న లేఖపై ఎవరి వేలుముద్రలు ఉన్నాయన్న దానిపై సీబీఐ ఇంకా ఓ నిర్ధారణకు రాలేకపోతోంది.
ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి లేఖపై వేలి ముద్రల్ని తేల్చేందుకు కీలకమైన నిన్ హైడ్రిన్ టెస్ట్ చేయించాలని సీబీఐ నిర్ణయించింది. అయితే ఈ కేసులో కీలక ఆధారంగా ఉన్న వివేకా లేఖకు ఈ పరీక్ష చేయించాలంటే సీబీఐ కోర్టు అనుమతి తప్పనిసరి కావడంతో ఈ మేరకు సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైదరాబాద్ సీబీఐ కోర్టు.. నిన్ హైడ్రిన్ పరీక్షకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

అలాగే వివేకా రాసిన అసలు లేఖను కోర్టుకు సమర్పించి, ఈ లేఖకు సంబంధించి అవసరమైనన్ని సర్టిఫైడ్ కాపీలు తీసి పెట్టుకోవాలని సీబీఐకి సీబీఐ కోర్టు సూచించింది. నిన్ హైడ్రిన్ పరీక్ష వల్ల అసలు లేఖ దెబ్బతింటే మాత్రం ఈ సర్టిఫైడ్ కాపీని ఆధారంగా వాడుకోవాలని తెలిపింది. దీంతో సీబీఐ ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ లేఖ సర్టిఫైడ్ కాపీలు తీసుకున్న తర్వాతే అసలు లేఖను నిన్ హైడ్రిన్ పరీక్షకు పంపే అవకాశముంది.
వివేకా రాశారని చెబుతున్న ఈ లేఖలో డ్రైవర్ ప్రసాద్ ను ఆలస్యంగా వచ్చినందుకు ప్రశ్నిస్తే తనను చంపేశాడని ఆయన స్వయంగా రాసినట్లు తేలింది. అయితే ఈ లేఖను ఇప్పటికే ఫోరెన్సిక్ కు పంపిన సీబీఐ.. ఒత్తిడిలో వివేకానే ఈ లేఖ రాసినట్లు నిర్ధారించుకుంది. అయితే ఈ లేఖను వివేకా అల్లుడు దాచిపెట్టారని తేలడంతో వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పుడు అదే అంశాన్ని హైలెట్ చేస్తూ సీబీఐని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ లేఖపై ఎవరెవరి వేలిముద్రలు ఉన్నాయో తేలిస్తే అసలు నిందితులు బయటికొస్తారని సీబీఐ భావిస్తోంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications