టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి ఇళ్లలో సీబీఐ సోదాలు- ట్రాన్స్‌ట్రాయ్ రుణాల ఎగవేతపై
టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆస్తులపై ఇవాళ సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. గుంటూరులోని రాయపాటి నివాసం, ఆఫీసుల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టు తీసుకున్న రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ సంస్ధ దివాలా తీసింది. ఈ వ్యవహారంలో సీబీఐ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టిన టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ సంస్ధ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుంది. వీటిని సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు చేసిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీబీఐ తనిఖీలు నిర్వహిస్తోంది. రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ సంస్ధ తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో ఇండియన్ బ్యాంకు గతంలో ఆస్తుల వేలం నోటీసులు కూడా జారీ చేసింది.

ట్రాన్స్‌ట్రాయ్ సంస్ధకు సీఈవోగా పనిచేసిన శ్రీధర్ అనే్ వ్యక్తి మోసం చేశాడంటూ రాయపాటి కుటుంబ సభ్యులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా వారి నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం రూ.300 కోట్ల రూపాయల రుణాలను ట్రాన్స్‌ట్రాయ్ బ్యాంకులకు బాకీ పడినట్లు తెలుస్తోంది. దీనిపై గతంల రెండుసార్లు సీబీఐ దాడులు నిర్వహించింది. పలు డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకుంది. వీటి ఆధారంగా మరో విడత సీబీఐ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications