వంశీ ఏం నేరం చేశాడని..: నేను చెప్పిందే అనుసరిస్తున్నారు: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. వంశీని లొంగదీసుకోవాలని కావాలనే తప్పుడు కేసు పెట్టారు. వంశీ ఏం నేరం చేశాడని కేసు పెట్టారని ప్రశ్నించారు. తెలిసిందే. వంశీ రాజీనామాపై పలువురు టీడీపీ ముఖ్య నేతలు స్పందించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుకు వంశీ లేఖ రాయడం.. ఆయన రిప్లై ఇవ్వడం ఇవన్నీ జరిగిపోయాయి. తాజాగా.. కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో వంశీ వ్యవహారంపై చంద్రబాబు మరోసారి మాట్లాడారు. అదే విధంగా ముఖ్యమంత్రి జగన్ తాను చెప్పిందే అనుసరించాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు. అయితే, పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి వంశీ హాజరు కాలేదు.

ఆర్దిక మూలాలు దెబ్బతీస్తున్నారు..

ఆర్దిక మూలాలు దెబ్బతీస్తున్నారు..

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీకి చెందిన గన్నవర ఎమ్మెల్యే వల్లభనేని వంశీని బుజ్జగించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన తరువాత వంశీ తాను టీడీపీని వీడుతున్నట్లుగా చంద్రబాబుకు లేఖ రాస్తూనే..అందులో ఎమ్మెల్యే పదవిని సైతం వీడుతున్నానని...మొత్తంగా రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని పేర్కొన్నారు. దీనికి చంద్రబాబు సైతం స్పందించారు. వంశీని బుజ్జగించే ప్రయత్నం చేసారు. అండగా ఉంటామని..వైసీపీ వేధింపులకు భయపడాల్సిన పని లేదని హామీ ఇచ్చారు. వంశీతో చర్చల కోసం పార్టీ సీనియర్లకు బాధ్యతలు అప్పగించారు. అయితే కృష్ణా జిల్లా పార్టీ సమావేశంలో మరోసారి వంశీ అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారని... పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా సరెండర్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారంటూ అధికార పార్టీ పైన ఆరోపణలు చేసారు.

 వంశీ పైన కాదు..ఎమ్మార్వోపైన కేసు పెట్టాలి..

వంశీ పైన కాదు..ఎమ్మార్వోపైన కేసు పెట్టాలి..

ఇదే సమీక్షలో వంశీకి మద్దతుగా చంద్రబాబు మాట్లాడారు. వంశీని లొంగదీసుకోవాలని కావాలనే తప్పుడు కేసు పెట్టారు. వంశీ ఏం నేరం చేశాడని కేసు పెట్టారు?. వంశీపై కేసు పెట్టడం కాదు.. ఎమ్మార్వో, ఎస్సైని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులపై రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు అచ్చెన్న, కూన రవి, సోమిరెడ్డి, యరపతినేనిపై కేసులు పెట్టారని.. కోడి కత్తి కేసు ఏమైందని ప్రశ్నించారు. సొంత బాబాయి వివేకా కేసును ఏం తేల్చలేకపోయారంటూ జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. రివర్స్ టెండరింగ్‌పై మాట్లాడిన బాబు.. టీడీపీ చేసిన అభివృద్ది పనులన్నీ రివర్స్ చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ చేస్తున్నది రివర్స్‌ టెండరింగ్‌ కాదని.. అది రిజర్వ్ టెండరింగ్‌ అని ఎద్దేవా చేసారు. టీడీపీ హయాంలో హాయిగా బతికిన ప్రజలు.. ఇప్పుడు కష్టాలు కొని తెచ్చుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. బస్తా సిమెంట్ కన్నా ఇసుక ధర ఎక్కువ ఉండడం జగన్నాటకమేనని.. చంద్రబాబు వ్యాఖ్యానించారు.

నేను చెప్పిందే అనుసరిస్తున్నారు..

నేను చెప్పిందే అనుసరిస్తున్నారు..

చంద్రబాబు ఇదే సమయంలో తాజాగా ఇరిగేషన్ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ చేసిన తాజా ప్రతిపాదనల పైన స్పందించారు. వరదల వల్ల ఇసుక కొరత అనడం అబద్ధమన్నారు. ఇసుక పాలసీ మార్చకుండా ఉంటే రాష్ట్రంలో ఐదుగురు ఆత్మహత్య చేసుకునేవారు కాదని పేర్కొన్నారు. 8 నెలల్లో పట్టిసీమ పూర్తి చేశారని.. అది టీడీపీ దూర దృష్టని చెప్పుకొచ్చారు. ఇరిగేషన్‌లో మీకు ఓనమాలు రావని జగన్‌కు చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు తాను చెప్పిందే అనుసరించాల్సి వస్తోందన్నారు. దేశంలో రైతురుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీనేఅని వివరిస్తూ... ప్రభుత్వంగా బాండ్లు ఇచ్చాం.. గౌరవించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందన్నారు. రూ.12,500 ఇస్తామని చెప్పి ఇప్పుడెందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+