భీమవరంలో రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి ఇంట విజయోత్సవ సంబరాలు!!

తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులే కాదు దశాబ్ద కాలంగా కేసీఆర్ పాలనతో విసిగిపోయిన విభిన్న వర్గాల వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకున్న క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు గాంధీ భవన్ వద్ద సంతోషంతో సంబరాలు జరుపుకున్నారు. ఇటు తెలంగాణాలోనే కాదు అటు ఏపీలోనూ సంబరాలు జరిగాయి..

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఏపీ కాంగ్రెస్ సంబరాలు జరుపుకుంది అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే.. అలాంటిదేమీ లేదు. తెలంగాణా కాంగ్రెస్ గెలిచిందని, రేవంత్ రెడ్డి శ్రమకు తగిన ఫలితం వచ్చిందని భీమవరంలో ఆయన వియ్యంకుడు, రేవంత్ రెడ్డి కూతురు నైమిష రెడ్డి అల్లుడు శివారెడ్డి సంబరాలు జరుపుకున్నారు.

Celebrations at Revanth Reddy daughter Nymisha Reddys house in Bhimavaram!!

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి కూతురు నిమిషా రెడ్డి, అల్లుడు శివారెడ్డి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో తమ ఇంట్లో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇంటి ముందు భారీగా బాణాసంచా పేల్చి తెలంగాణా కాంగ్రెస్ విజయాన్ని భీమవరంలోని వారి ఇంటి వద్ద సెలబ్రేట్ చేసుకున్నారు.

భీమవరంలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డి ఇంటి వద్ద బంధువులు సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయంతో భారీ బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచిన హౌసింగ్ బోర్డు కాలనీవాసులు, బంధువులు, కుటుంబ సభ్యులు ప్రజల తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి వియ్యంకుడు రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ అధినేత వెంకట రెడ్డి కూడా తన వియ్యంకుడు సాధించిన ఘనత కు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. కాంగ్రెస్‌ను గెలిపించిన తెలంగాణ ప్రజలకు నైమిషా రెడ్డి, శివారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+