అమరావతి, వరంగల్ లకు కేంద్రం శుభవార్త!
దేశవ్యాప్తంగా రహదారుల విస్తరణకు కేంద్రం కృషి చేస్తుంది. జాతీయ రహదారుల పైన కూడా ట్రాఫిక్ రద్దీ పెరిగిన నేపథ్యంలో, ఈ పెరిగిన ట్రాఫిక్ రద్దీని నివారించటం కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు 34 కొత్త యాక్సెస్ కంట్రోల్డ్ రింగ్ రోడ్ల అభివృద్ధిని చేపట్టేందుకు రెడీ అయింది.
కేంద్రం మరో కొత్త నిర్ణయం
రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ గంటకు 100 నుండి 120 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించేలా రింగ్ రోడ్లను అభివృద్ధి చేయడానికి సంకల్పించి దీనికి సంబంధించి రోడ్ మ్యాప్ లను యాక్సెస్ కంట్రోల్డ్ రింగ్ రోడ్ లను అభివృద్ధి చేసే రాష్ట్రాలతో పంచుకుంది. ముఖ్యంగా మెట్రో నగరాలతో పాటు పట్టణ ప్రాంతాలలో జాతీయ రహదారుల పైన రద్దీని తగ్గించే లక్ష్యంతో నిర్ణయం తీసుకుంది.

ఈ నగరాలలో యాక్సెస్ కంట్రోల్డ్ రింగ్ రోడ్ల అభివృద్ధి
ఐదు లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాలు, సముదాయాలను గుర్తించిన కేంద్ర రోడ్డు రవాణా హైవేల మంత్రిత్వ శాఖ గ్రీన్ ఫీల్డ్ రింగ్ రోడ్ల నిర్మాణం కోసం రెడీ అయింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమరావతి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వరంగల్ ఉన్నాయి. అంతేకాదు కోల్కత్తా, నాసిక్, తిరువనంతపురం, అజ్మీర్, మంగళూరు, ఉదయపూర్, తిరునల్వేలి వంటి నగరాలు ఉన్నాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల రాష్ట్రాలకు లబ్ధి
ఇక ఈ ప్రాంతాలకు ఇరువైపులా దూరాన్ని డెవలప్మెంట్ కంట్రోల్ జోన్ గా ప్రకటించి ఆ జోన్లలో ప్రజా వినియోగాలు, గ్రీన్ జోన్లు మినహా వేరే ఇతర నిర్మాణాలు చేయకుండా చూస్తారు . కేంద్రం ఈ ప్రాజెక్టులకు రాష్ట్రాల ఆర్థిక సహకారాన్ని కూడా కోరుతుంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల రాష్ట్రాలకు లబ్ధి జరుగుతుంది కనుక ఈ ప్రాజెక్టు వ్యయంలో కొంత వాటాను రాష్ట్రాలు భరించాల్సిన అవసరం ఉందని కేంద్రం భావిస్తోంది.
గ్రీన్ ఫీల్డ్ హైవేల నిర్మాణానికి రాష్ట్రాలు ఆర్ధిక సహాయం చెయ్యాలి
ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేల నిర్మాణానికి సంబంధించి ప్రాజెక్ట్ వ్యయంలో సగం భరించడం, ల్యాండ్ పూలింగ్ ద్వారా మద్దతు ఇవ్వడం వంటి వాటిని కేంద్రం రాష్ట్రాలకు కేటాయిస్తుంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో అవసరం ఉన్న దగ్గర కొత్త యాక్సెస్ కంట్రోల్డ్ రింగ్ రోడ్లను అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలోనే అమరావతికి రింగురోడ్డు నిర్మాణం జరిగితే హైదరాబాద్ జాతీయ రహదారి నుండి అమరావతి విజయవాడ చేరుకోవడానికి రద్దీ తగ్గుతుంది.












Click it and Unblock the Notifications