ఏపీకి చేసే సాయం ఇదే: పీఐబీ వెబ్‌సైట్‌లో నోట్ పెట్టిన కేంద్రం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు చేయబోయే ఆర్ధిక సాయంపై కేంద్రం అధికారిక ప్రకటన చేసింది. ఏపీకి ఆర్ధిక సాయానికి సంబంధించిన వివరాలను కేంద్రం పీఐబీ వెబ్‌సైట్‌లో ఉంచింది. బుధవారం అర్ధరాత్రి కేంద్ర ఆర్ధిక శాఖమంత్రి అరుణ్ జైట్లీ ఏపీకి ఆర్ధిక సాయంపై చేసిన ప్రకటనను యధాతథంగా గురువారం వెబ్‌సైట్‌లో పెట్టారు.

అంతేకాదు ఏపీకి ప్రత్యేక హోదాకు మించి కలిగే ప్రయోజనాలను అందించామని అందులో కేంద్రం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనేజేషన్ యాక్ట్‌లో ఉన్న మేరకు ఏ రకమైన సాయం చేయాలనే విషయాన్ని వెబ్‌సైట్‌లో ఉంచారు. ఇందులో నాలుగు కేటగిరిల కింద ఏపీకి కేంద్రం ఆర్ధిక సాయం చేయనుంది.

Central Assistance to Andhra Pradesh

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం, విభ‌జ‌న సంద‌ర్భంగా నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ఇచ్చిన స్టేట్ మెంట్, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు, 1-12-15 రిపోర్ట్ ఆన్ డెవ‌ల‌ప్ మెంట్ స‌పోర్ట్ టు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేట‌గిరీల కింద సాయం అందించ‌నున్న‌ట్లు పేర్కొంది. ఏపీకి ప్రత్యేక ఆర్ధిక సాయం అంటూ నీతి ఆయోగ్‌ సిఫార్సులను వైబ్‌సైట్‌లో పొందుపరిచారు.

సెక్షన్ 90 ప్రకారం పోలవరాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుగా చేయాలని, ఏపీలో వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక ప్యాకేజీ వివరాలతోపాటు 13 షెడ్యూల్లో ఏయే అంశాలు ఉన్నది, సంస్థలు ఏ విధంగా విభజన చేయాలన్నది కూడా తెలిపారు. ఇప్పటి వరకు ఏమిచ్చారో, ఏమేమి ఇవ్వాలో వెబ్ సైట్‌లో పేర్కొన్న నోట్‌లో కేంద్రం పేర్కొంది.

పన్నుల వాటా పెంచాక ఏపీకి రూ. 7,789 కోట్లు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. దీంతో పాటు స్టీల్ ప్లాంట్, మెట్రో కారిడార్లు పరిశీలనలో ఉన్నాయని కేంద్రం నోట్ లో పేర్కొంది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయానలను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు పేర్కొంది.

వీటితో పాటు 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల కేట‌గిరీలలో ఐదేళ్ల‌లో రెవెన్యూ లోటు కింద రూ. 22,113 కోట్లు ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్ర‌ ఆర్థిక శాఖ‌ తెలిపింది. దీనిలో రెవెన్యూ లోటు కింద ఇప్ప‌టి వ‌ర‌కు రూ.3,979.5 కోట్లు ఇచ్చామ‌ని పేర్కొంది. మిగ‌తాది వాయిదాల ప‌ద్ధ‌తిలో చెల్లిస్తామ‌ని తెలిపింది.

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి మొత్తం రూ.3500 కోట్లు మాత్ర‌మే చెల్లించనున్నట్లు కేంద్రం ఆర్థిక శాఖ‌ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇప్పటికే రూ. 2500 కోట్లు ఇచ్చిన‌ట్లు పేర్కొంది. త్వరలోనే మ‌రో వెయ్యి కోట్లు కూడా చెల్లిస్తామ‌ని పేర్కొంది. వెనకబడిన జిల్లాల కోసం ఇప్పటికే రూ.1050 కోట్లు ఇచ్చిన‌ట్లు పేర్కొంది.

పీఐబీ వెబ్‌సైట్‌లో కేంద్రం ఉంచిన నోట్ ను చదవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+