ఏపీకి కేంద్రం మరో వరం - భారీగా నిధులు..!!
కేంద్ర మంత్రివర్గం ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ సుదీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న పోలవరం నూతన డీపీఆర్ కు ఆమోద ముద్ర వేయననట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇదే అంశం పైన ఏపీ ప్రభుత్వం పలు మార్లు ప్రధానితో సహా కేంద్రానికి అభ్యర్దన చేసింది. ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ డీపీఆర్ ను ఆమోదించనున్నట్లు సమాచారం. పలితంగా అడ్వాన్స్ గా ఏపీ ప్రభుత్వానికి రూ 12 వేల కోట్ల మేర నిధులు అందనున్నాయి.
కేంద్రం అంగీకారం
ఏపీ ప్రభుత్వం అభ్యర్ధనను కేంద్రం ఆమోదించటం లాంఛన ప్రాయంగా మారింది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నూతన డీపీఆర్ కు కేంద్ర ఆమోదం లభించినున్నట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రాజెక్టు పనులు ముందుకు వెళ్లాలంటే కేంద్ర నిధులు అవసరమని తాజాగా ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు నేరుగా ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, జలవనరుల శాఖ మంత్రి పాటిల్‌లతో చర్చించారు. డీపీఆర్ ఆమోదం పొందడంతో పాటు పోలవరంలో 45.72 మీటర్ల స్థాయికి నీళ్లు నిలబెట్టేలా అవసరమైన అన్ని పనులకూ నిధులు ఇచ్చేలా మరో డీపీఆర్ కేంద్రానికి సమర్పించారు.

పోలవరంకు నిధులు
దీంతో, కేంద్ర మంత్రిమండలి కొత్త డీపీఆర్ పైన సానుకూలంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలస్తోంది. ప్రస్తుతం పోలవరం కోసం 30 వేల 436.95 కోట్ల రూపాయలతో కొత్త డీపీఆర్ ప్రతిపాదించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం, సాంకేతిక సలహా మండలి, రివైజ్డ్ కాస్ట్ కమిటీ, పెట్టుబడుల అనుమతి మండలి ఆమోదం లభించింది. కేంద్ర మంత్రిమండలి ఆమోదం కోసం వేచి చూస్తోంది. మంత్రి మండలి ముందుకు ఈ డీపీఆర్ వెళ్లగా ఆమోదం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు
ఏపీకి అడ్వాన్స్
గతంలో 2010-11 ధరలతో రూ.16,010.45 కోట్లకు డీపీఆర్ ఆమోదం పొందింది. ఆ ప్రకారం నిధులన్నీ కేంద్రం తిరిగి చెల్లించింది. తాజా డీపీఆర్ కేంద్ర ఆమోదంతో రాష్ట్రానికి రూ.12,157.53 కోట్లు అందుతాయి. పోల వరంకు సంబంధించి మిగిలి నిధులను ఇప్పటికే రీయింబర్స్ చేసినందున ఈ మొత్తాన్ని అడ్వాన్స్ గా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. 2016లో నాబార్డుతో కేంద్రం ఒప్పందం చేసుకొని వారి నుంచి కేంద్రం రుణం రూపంలో పొంది రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తోంది. దీంతో, ఈ రూ 12 వేల కోట్లు అడ్వాన్స్ గా ఇస్తే ఆర్దికంగా వెసులుబాటు కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications