చంద్రబాబును ఢిల్లీకి పిలిచిన కేంద్ర పెద్దలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో పాల్గొనాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. భారత్‌లో నిర్వహించే జీ-20 భాగస్వామ్య దేశాల సమావేశాలను ఎలా నిర్వహిస్తే బాగుంటుందనే అంశంపై చర్చించనున్నారు. ఈమేరకు సమావేశానికి హాజరు కావాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి చంద్రబాబుకు ఫోన్‌ చేసి ఆహ్వానించారు. సమావేశానికి ఉన్న ప్రాధాన్యతను బాబుకు వివరించారు. డిసెంబర్‌ 5న సాయంత్రం 5.00 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో సదస్సు జరగనుంది. జీ-20 దేశాల కూటమికి భారత్‌ అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే.

2023లో భారతదేశం జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సును నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు దేశంలోని ప్రముఖ రాజకీయవేత్తలను కేంద్రం ఆహ్వానిస్తోంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వారిదగ్గర నుంచి అవసరమైన సలహాలు, సూచనలు తీసుకొని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయబోతోంది. దీనిలో భాగంగానే చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆహ్వానం పంపించారు. G20 శిఖరాగ్ర సమావేశం 2023లో ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)ని ప్రత్యేక ఆహ్వానితునిగా కేంద్రం ఆహ్వానించింది. 2022 సెప్టెంబర్‌లో నిర్వహించిన 14వ జాయింట్ కమిషన్ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలలో "పురోగతి"ని ప్రత్యేకంగా చర్చించారు.

 Central government called Chandrababu to Delhi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+