సజ్జలపై గురి, అనూహ్య మలుపు..!?

వైసీపీలో కీలక పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే లిక్కర్ కేసులో వైసీపీ ముఖ్యులు పలువరు విచారణ ఎదుర్కొన్నారు. పలువురు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో తిరిగి సిట్ విచారణ స్పీడ్ అందుకున్నట్లు కనిపిస్తోంది. మాజీ సీఎం జగన్ వ్యక్తిగత సహాయకుడు కేఎన్ఆర్ రెండు రోజుల విచారణలో సిట్ కీలక అంశాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం మేరకు వైసీపీ ముఖ్య నేతలకు సైతం నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. కాగా.. సజ్జల విషయం లో జరుగుతున్న చర్చ ఆసక్తి కరంగా మారింది.

మద్యం కేసులో సిట్ మళ్లీ వేగం పెంచింది. వరుస నోటీసులు జారీ చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. కాగా.. ఇప్పుడు ఈ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశముంది. వైసీపీలో రాజకీయ వ్యవహారాలు చూసే సజ్జల రామకృష్ణారెడ్డిని సిట్‌ అధికారులు విచారించే అవకాశం ఉన్న ట్లు తెలిసింది. దర్యాప్తులో భాగంగా ఇటీవల లభించిన ఆధారాలతో ఆయనకు ఒకటి, రెండు రోజుల్లో నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం. సోమవారం తర్వాత ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లిక్కర్‌ కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు, కీలక వ్యక్తులను సిట్‌ విచారించింది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత మిథున్‌ రెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డితో పాటు జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డిని సిట్ అరెస్ట్‌ చేసింది. తాజాగా జగన్‌ పీఏ కేఎన్‌ఆర్‌ను సిట్‌ అధికారులు విచారించారు. ఈ నేపథ్యంలో సజ్జలకు నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

TTD: దర్శన టికెట్ల కేటాయింపులో కీలక మార్పులు, ఇక నుంచి ఇలా..!!
TTD: దర్శన టికెట్ల కేటాయింపులో కీలక మార్పులు, ఇక నుంచి ఇలా..!!
sit-officials-chances-to-give-notices-for-ysrcp-key-leader-sajjala-ramakrishna-reddy-in-liquor-case

నోటీసులు జారీకి అవకాశం..?

కాగా, కేఎన్ఆర్ విచారణ సమయంలో సిట్ అధికారులు ఆర్దిక లావాదేవీలకు సంబంధించి పలు విషయాల పైన ఆరా తీసినట్లు సమాచారం. చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డికి సంబంధించిన లావాదేవీల్లో కేఎన్‌ఆర్‌ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా విచారణకు పిలిపించి సిట్‌ అధికారులు ప్రశ్నించారు. ఇళ్లు, వ్యాపారాలతో పాటుగా స్థిరాస్తులు.. భార్య బ్యాంకు ఖాతాలో సుమారు 20 కోట్ల రూపాయల వరకూ లావాదేవీ లను గుర్తించినట్లు తెలుస్తోంది. తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలంలో ఒల్లూరు వద్ద కేవీఆర్‌ ఇన్‌ఫ్రా పేరుతో వేసిన 47ఎకరాల లే అవుట్‌ వివరాలు బయట పడ్డాయి. అందులో నుంచి ఆస్తులు కొనుగోలు చేసిన వారిలో జగన్‌ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న కేఎన్‌ఆర్‌ పేరిట పదెకరాలు 2021లో రిజిస్టర్‌ అయినట్లు తేలింది. ఎకరా రూ.8 లక్షల చొప్పున పదెకరాల ఆస్తిని కేఎన్‌ఆర్‌ రూ.81 లక్షలకు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దీంతో ఆయనకు సిట్‌ అధికారులు నోటీసులిచ్చి విచారణకు పిలిచారు. ఇప్పుడు సజ్జలకు నోటీసులు ఇస్తారనే సమాచారం సంచలనంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+