కొత్తగా వీరికీ ఉచిత విద్యుత్, రూ.500 వంట గ్యాస్ పథకాల అమలు- మార్గదర్శకాలు..!!

సంక్షేమ పథకాల విస్తరణ పైన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలను అర్హులు అందరికీ అమలు చేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు ఈ రోజు జరిగే మంత్రివర్గ భేటీలో తుది ఆమోదం ఇవ్వనున్నారు. కొత్త పెన్షన్లు... రేషన్ కార్డుల పంపిణీ పైన మార్గదర్శకాలు సిద్దం అయ్యాయి. 22 ఏ భూముల వివాదంతో పాటుగా గ్రేటర్ పరిధిలో పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

తెలంగాణ మంత్రివర్గం ఈ రోజు భేటీ కానుంది. ఈనెల 17వ తేదీ నుంచి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళుతుండటంతో కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముంది. భేటీలో రైతులు, ఉద్యోగులకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే మెట్రో రైలు విస్తరణ, మూసీ నది ప్రక్షాళన వంటి వాటిపై కూడా చర్చించే అవకాశముంది. చట్టసభల్లో ప్రవేశానికి 21 ఏళ్లకు వయసు తగ్గించాలని, కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ బిల్లు పెట్టడంపై చర్చ మెట్రో విస్తరణ, హిల్ట్‌ పాలసీ పైనా నిర్ణయం తీసుకోనున్నారు. ఇక.. రేపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంక్షేమ పథకాల విస్తరణపై మంత్రివర్గం పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. కొత్తగా సుమారు 2 లక్షలకు పైగా చేయూత పింఛన్ల మంజూరుకు ఆమోదంతో పాటుగా కొత్తగా రేషన్‌కార్డు లు పొందిన వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాలను మంజూరు చేయాలని భావిస్తున్నారు.

 చర్లపల్లి-కొట్టాయం మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు: రూట్, హాల్టింగ్ స్టేషన్లు, షెడ్యూల్..!!
చర్లపల్లి-కొట్టాయం మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు: రూట్, హాల్టింగ్ స్టేషన్లు, షెడ్యూల్..!!
telangana-cabinet-may-take-decision-on-land-pooling-framework-welfare-benefits-and-special-assembl

సంక్షేమ పథకాల విస్తరణ.. మెట్రో పై నిర్ణయం

అదే విధంగా నూతన భూ సమీకరణ విధానంపై కూడా కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చే రైతులకు అదనపు ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో వివాదాస్పదంగా మారిన 22ఏ నిషేధిత భూముల వివాదంపై మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చినట్లు ఆందోళన వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ఏం జరిగింది? ఎలా పరిష్కరించాలనే విషయంపై కీలక చర్చ జరగనుంది. ఈ వివాదానికి ముగింపు పలికేలా అధికారులకు కేబినెట్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న మెట్రో అనుమతులు.. రెండో దశకు రుణ సమీకరణపై సమాలోచనలు చేయనున్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల ముహూర్తం ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+