Bigg Boss Agnipariksha: పిలిచి అవమానించారు.. బిగ్‌బాస్‌కు శాపం పెట్టిన ఉప్పల్ బాలు!

Bigg Boss Agnipariksha: తెలుగు బుల్లితెరపై ప్రముఖ రియాలిటీ షో 'బిగ్‌ బాస్'కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 10కు ముందే సందడి మొదలైపోయింది. ఇప్పటికే అగ్నిపరీక్ష ఆడిషన్స్ పూర్తి కావడంతో 15 మందిని సెలెక్ట్ చేశారు. వీరికి వివిధ టాస్కులు పెట్టిన.. అనంతరం వీరి నుంచి ఐదారుగురిని కామనర్స్ కోటాలో ఎంపిక చేసి.. బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి పంపించబోతున్నారు. అయితే అగ్నిపరీక్ష ఆడిషన్స్‌లో పలువురు సామాన్యులతో పాటు సోషల్‌మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు కూడా పాల్గొన్నారు. ఈ ఆడిషన్స్ లో సోషల్ మీడియా సెన్సేషన్ ఉప్పలు బాలు ఎలిమినేట్ కావడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అగ్నిపరీక్ష ఆడిషన్స్ నిర్వహించిన తీరుపై ముఖ్యంగా జడ్జీగా ఉన్న ప్రముఖ నటుడు నవదీప్‌పై మండిపడుతూ ఉప్పల్ బాలు సోషల్ మీడియా వేదికగా వీడియో రిలీజ్ చేశాడు.

Agadha First Review: ఒళ్లు గగుర్పొడితే మిస్టికల్ హార్రర్ థ్రిల్లర్..!
Agadha First Review: ఒళ్లు గగుర్పొడితే మిస్టికల్ హార్రర్ థ్రిల్లర్..!

సోషల్ మీడియా సంచలనం ఉప్పల్ బాలు ఇటీవల చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ వీడియో తీవ్ర కలకలం రేపింది. అగ్నిపరీక్ష స్టేజ్ పై తనకు జరిగిన అవమానాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉప్పల్ బాలు ఈ వీడియోను విడుదల చేశారు. ఆడిషన్స్ కోసం తనను పిలిచి.. అవమానకరంగా తిరస్కరించడం పట్ల ఉప్పల్ బాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆడిషన్స్ లో జడ్జీగా వ్యవహరించిన నటుడు నవదీప్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాను మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి ఎంతో కష్టపడి పైకి వచ్చానని.. అగ్నిపరీక్ష ఆడిషన్స్ లో అన్ని రౌండ్లు దాటుకుని ఫైనల్ వరకు చేసుకున్నానని ఆయన వెల్లడించారు. కానీ చివరి నిమిషంలో నీ వీడియోలు వల్గర్ గా ఉంటాయని.. అవి దేనికి పనికొస్తాయని తనకు ఎటువంటి గేమ్ లేదా టాస్క్ ఇవ్వకుండా నవదీప్ తనను అవమానించారని ఉప్పల్ బాలు విమర్శించారు.

Bigg Boss Agnipariksha Uppal Balu Slams Judge Navdeep After Elimination anger over his rejection

ఉప్పల్ బాలు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.." నన్ను బిగ్ బాస్ అగ్ని పరీక్షకు పిలిచి తీవ్రంగా అవమానించారు. మీ వీడియోలు వల్గర్‌గా (అసభ్యకరంగా) ఉంటాయి, ఇవి దేనికి పనికొస్తాయి? అని విమర్శించారు. నేనేమీ తప్పు పనులు చేయడం లేదు.. కేవలం కాలక్షేపం కోసం రీల్స్ చేసుకుంటున్నాను. మిడిల్ క్లాస్ వాళ్లమంటే మాకు మనసు ఉండదా? మేము కష్టపడి వీడియోలు చేసుకుంటూ పైకి రాకూడదా? అవకాశం వచ్చింది కాబట్టే జడ్జీలు ఆ స్థానంలో కూర్చున్నారు..తమలాంటి వారిని చులకనగా చూడకూడదు" అని ఉప్పల్ బాలు జడ్జీగా వ్యవహరిస్తున్న నవదీప్ పై తీవ్రంగా మండిపడ్డారు. జడ్జీగా వ్యవహరించిన నవదీప్ ను నేరుగా ప్రశ్నిస్తూ.." మీరు చేసిన వీడియోలు ఎవరికి ఉపయోగపడ్డాయి.. సమాజానికి మీరేమైనా దానం చేశారా? లక్ష రూపాయలు ఇచ్చారా? పేదపిల్లల పెళ్లిళ్లకు పుస్తెల తాడు ఏమైనా ఇచ్చారా? జడ్దీగా అవకాశం వచ్చింది కాబట్టి మమ్మల్ని ఈ విధంగా మాట్లాడుతున్నారు." అని ఉప్పల్ బాలు నిలదీశారు.

జూనియర్ ఎన్టీఆర్‌ కు శస్త్రచికిత్స విజయవంతం.. కిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
జూనియర్ ఎన్టీఆర్‌ కు శస్త్రచికిత్స విజయవంతం.. కిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

ఈ పాపం మిమ్మల్ని వదిలిపెట్టదు.. శాపం పెట్టిన ఉప్పల్ బాలు
తన కష్టాన్ని, ప్రతిభను తక్కువ చూసి చూపిస్తూ ఉద్దేశపూర్వకంగానే ఎలిమినేట్ చేశారని.. అగ్నిపరీక్ష పేరులో తనను ఇబ్బంటి పెట్టి రిజెక్ట్ చేశారని ఉప్పల్ బాలు ఆవేదన వ్యక్తం చేశారు. నవదీప్ ను అసలు వదిలిపెట్టనని.. తనను ఇలా ఆవేదనకు గురిచేసినందుకు కచ్చితంగా శాపం తగులుతుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. తనకు న్యాయం జరగాలని ఉప్పల్ బాలు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుండగా.. కొందరు ఉప్పల్ బాలు ఆవేదనపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఆడిషన్ ప్రక్రియలో ఇలాంటి కామెంట్స్ సాధారణం అని పేర్కొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+