విశాఖ రైల్వే జోన్ పై కేంద్రం గుడ్ న్యూస్-వాల్తేర్ డివిజన్ ఇలా ..!
ఏపీలో విభజన హామీల్లో భాగంగా విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ పై కేంద్రం మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే రైల్వే శాఖ ఈ కొత్త జోన్ ఏర్పాటు కోసం చురుగ్గా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రధాన కార్యాలయం నిర్మాణానికి ప్రధాని మోడీ చేతుల మీదుగా శంఖుస్థాపన కూడా చేశారు. ఇప్పుడు ఈ విశాఖ రైల్వే జోన్ పరిధిని కూడా నిర్ణయిస్తూ కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది.
దీని ప్రకారం వాల్తేర్ డివిజన్‍ను విశాఖ డివిజన్‍గా పేరు మారుస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. అలాగే గతంలో ఉన్న విశాఖ డివిజన్ పరిధి మార్చుతూ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు రానున్నాయి. అలాగే విశాఖ డివిజన్‍లో 410 కి.మీ పరిధిని కూడా చేరుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

అలాగే కొండపల్లి-మోటుమర్రి సెక్షన్‍ను సికింద్రాబాద్ నుంచి విజయవాడ డివిజన్‍కు మారుస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ మరో నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాయగడ రైల్వే డివిజన్ పరిధి కూడా ఖరారు చేస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. తాజా మార్పుల ప్రకారం రైల్వే డివిజన్లు, జోన్లు పనిచేయబోతున్నాయి. వాస్తవంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ లోకి తొలుత వాల్తేరు డివిజన్ కలిపేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒప్పుకోలేదు. దీంతో కొత్త రైల్వే జోన్ కూడా ఆలస్యమైంది. ఇప్పుడు రైల్వే శాఖ నిర్ణయంతో పనులు వేగవంతం కానున్నాయి.












Click it and Unblock the Notifications