తెలంగాణ అభ్యంతరాల తోసివేత: గవర్నర్‌గిరే ఖాయం

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి త్వరలో కేంద్రం లేఖ రాయనుంది. గవర్నర్ అధికారాలపై తెలంగాణ ప్రభుత్వానికి వివవరణ ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారమే ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టామని కేంద్రం స్పష్టం చేసింది.
సెక్షన్ 8లో లేని అధికారాలను గవర్నర్‌కు ఇచ్చారంటూ తెలంగాణ ప్రభుత్వం వినిపిస్తున్న వాదనను కేంద్రం కొట్టిపారేసింది. హైదరాబాదు శాంతిభద్రతలపై అధికారాలను గవర్నర్‌కు అప్పగించాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. అందుకు తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా లేదు.
కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అయినా వెనక్కి తగ్గకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో హైదరాబాదు శాంతిభద్రతలు గవర్నర్ చేతిలోకి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications